ప్రేమోన్మాది వేధింపులతో యువతి ఆత్మహత్య

గుంటూరు ముచ్చట్లు:
 
ఏపీలో మరో ప్రేమోన్మాద ఘటన జరిగింది. శావల్యాపురం మండలం శానంపూడికి చెందిన శ్రావణి (18) ఆత్మహత్య చేసుకుంది. శానంపూడి గ్రామానికి చెందిన పులుకురి వెంకటాచారి మల్లేశ్వరి దంపతుల
రెండవ కుమార్తె శ్రావణి.  అదే గ్రామానికి చెందిన ప్రేమోన్మాది చెన్నం శెట్టి నాగేంద్ర బాబు వేధింపులు తాళలేక ఈ నెల 2వ తేదీ బుధవారం ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వినుకొండ పట్టణంలోని తిరుమల నర్సింగ్ హోమ్ కు తరలించగా 7 రోజుల పాటు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. విశ్వబ్రాహ్మణల మైన మేము
గ్రామంలో ఒక్క ఇల్లు కావడంతో తన కుమార్తెను వేధించారని మృతురాలి తల్లిదండ్రులు రోదించారు.  ప్రేమోన్మాది నాగేంద్ర బాబు నుండి  తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రకాశం జిల్లా అద్దంకి మండలం
వెంపరాల గ్రామంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రెండు నెలల క్రితం పంపించడం జరిగింది.  ఆ సమయంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రేమోన్మాది నాగేంద్రబాబు అతని తాతయ్య పత్తి శ్రీను, బావమరిది అనిల్
కలిసి వెంపరాల గ్రామం వెళ్లి శ్రావణి బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. కుటుంబం పరువు తీయ వద్దు, పెళ్లి కావాల్సిన అమ్మాయికి అన్యాయం చేయవద్దని
కాళ్లావేళ్లా పడి బ్రతిమిలాడిన శ్రావణిని వదలేదు. విషయం తెలుసుకున్న తండ్రి వెంకటాచారి వెంపరాల వెళ్లి  కుమార్తె శ్రావణి నిశావణం పూడి తీసుకురాగా సమాచారం తెలుసుకున్న ప్రేమోన్మాది
నాగేంద్రబాబు శ్రావణి ఇంటికి వెళ్లి తండ్రి వెంకటాచారి పై దాడి చేసాడు.  తండ్రిని తమ్ముణ్ణి చంపేస్తామని బెదిరించడంతో భయాందోళనకు గురైన శ్రావణి   మనోవేదనతో ఎలుకల మందు తీసుకొని ఆత్మ
హత్యకు గురైనట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు.
 
Tags: Young woman commits suicide with boyfriend abuse

Natyam ad