యువత సన్మార్గంలో నడుచుకోవాలి-పెగడపల్లి ఎస్ఐ కొక్కుల శ్వేత.

పెగడపల్లిముచ్చట్లు:
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని రాంబద్రుని పల్లి  గ్రామంలో పెగడపల్లి ఎస్ఐ కొక్కుల శ్వేత శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.  నేరాల నియంత్రణపై గ్రామంలోని యువతతో ఎస్ఐ అవగాహన సదస్సు నిర్వహించారు. నేరాలను అరికట్టేందుకు గ్రామంలో యూత్ టీంను ఎస్ఐ ఏర్పాటు చేశారు. వివిధ రకాల నేరాలపై దొంగతనాలు, గంజాయి డ్రగ్స్ సేవించడం, సైబర్ క్రైమ్స్,
మూఢనమ్మకాలు, ఈవ్టీజింగ్,  చిన్న పిల్లలు మహిళలపై జరిగే హత్యాచారాలు, కోవిడ్ నియమాల ఉల్లంఘన, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, డ్రంక్ అండ్ డ్రైవ్,  హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మొదలైన వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత
సన్మార్గంలో నడుచుకోవాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దన్నారు. గ్రామంలో జరిగే నేరాలపై పోలీసులకు సమాచారం అందించాలని గ్రామ ప్రజలను ఎస్ఐ కోరారు. నేరాల నియంత్రణకై ప్రతి గ్రామంలో ఒక విలేజ్ పోలీస్ వాలంటరీస్ టీంని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోరుకంటి రాజేశ్వర్ రావు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Youth should walk in the right path-Pegadapalli SI Kokkula Shweta

Natyam ad