YS Jagan padayatra started in Chittoor district

చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన వైఎస్‌.జగన్‌ పాదయాత్ర

Date : 28/12/2017

తంబళ్లపల్లె ముచ్చట్లు:

వైఎస్సాఆర్సీపి రాష్ట్ర అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఎద్దులవారికోటలో అడుగుపెట్టి , ఆర్‌ఎన్‌.తాండ, కోటలా, ఏటిగడ్డతాండ, వసంతాపురం, ప్రారంభమైంది. వైఎస్సాఆర్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ కన్వీనర్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులకు కరచాలనాలు , సెల్ఫిలు ఇస్తూ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.కాగా వైఎస్సాఆర్సీపి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయిత్రిదేవిని జగన్మోహన్‌రెడ్డి అప్యాయంగా చేతిని పట్టుకుని పలుకరిస్తూ పాదయాత్ర కొనసాగించారు. శుక్రవారం కోర్టు వాయిదాకు హాజరుకావాల్సి ఉన్నందున పాదయాత్రను ఆపివేసి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, సునిల్‌కుమార్‌, చిత్తూరు వైఎస్సాఆర్సీపి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయిత్రిదేవి,నాయకులు జంగాలపల్లె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags : YS Jagan padayatra started in Chittoor district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *