YSR Congress Party President Jagan's birthday was the birthday of the poor

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం

Date: 21/12/2017
, పలుచోట్ల కేక్ కటింగ్ సంబరాలు,బైక్ ర్యాలీలు
పలమనేరు ముచ్చట్లు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలైన సీవీకుమార్,రాకేష్ రెడ్డి, రెడ్డెమ్మక్రిష్ణమూర్తి ఆద్వర్యంలో పేదలకు అన్నదాన‍‌ కార్యక్రమం నిర్వహించారు. పలుచోట్ల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. పట్టణంలో  రాకేష్ రెడ్డి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. వికోట, బైరెడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండల కేంద్రాలలో మండల కన్వీనర్ల ఆద్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తమ పార్టీ అధినేత నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వైసీపీ నేతలు పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విజయభాస్కరరెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేగౌడ, జిల్లా కార్యదర్శులు చెంగారెడ్డి,తమ్మిరెడ్డి, కన్వీనర్లు బాలాజినాయుడు, మండీసుధ, బాలగురునాథం, బాగారెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి సుహేబ్, ఎస్సీసెల్ కార్యదర్శి రవి, పంజాణి సింగిల్ విండో చైర్మన్ శంకరప్ప,పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు బారీ సంఖ్యలో పాల్గొన్నారు.
YSR Congress Party President Jagan's birthday was the birthday of the poor
YSR Congress Party President Jagan’s birthday was the birthday of the poor
YSR Congress Party President Jagan's birthday was the birthday of the poor
YSR Congress Party President Jagan’s birthday was the birthday of the poor
Tag:  YSR Congress Party President Jagan’s birthday was the birthday of the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *