'YSR's death is unfortunate'

అమెరికాలో ‘అజ్ఞాతవాసి’కి రికార్డు వసూళ్లు

సాక్షి

Date;10/01/2018

భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన పవన్‌ కల్యాణ్‌ తాజా సినిమా ‘అజ్ఞాతవాసి’ రికార్డుల పరంపర మొదలైంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు విదేశీ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా ప్రీమియర్‌ షో వసూళ్ల విషయంలో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్‌ చేసినట్టు రిపోర్టులు చెప్తున్నాయి.

రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి: ద బిగినింగ్‌’ సినిమా అమెరికాలో ప్రీమియర్‌ షోల ద్వారా 1.3 మిలియన్‌ డాలర్లు (రూ. 8.2 కోట్లు) రాబడితే.. అజ్ఞాతవాసి సినిమా 14 లక్షల 64 వేల 467 అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) ఆర్జించి.. ఆ రికార్డును అధిగమించింది. తద్వారా ప్రీమియర్‌ షోల ద్వారా అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా ‘అజ్ఞాతవాసి’ నిలిచింది.

ప్రీమియర్‌ షోల ద్వారా అత్యధికంగా ఆర్జించిన సినిమాల్లో అజ్ఞాతవాసి తర్వాత బాహుబలి (13 లక్షల 64వేల డాలర్లు), చిరంజీవి ఖైదీనంబర్‌ 150 (12 లక్షల 95వేల డాలర్లు) ఉన్నాయి. త్రివిక్రమ్‌-పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా అజ్ఞాతవాసి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్‌ హిట్‌ అవ్వడంతో తాజా సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. కీర్తి సురేశ్‌, అను ఎమాన్యుయెల్‌ పవన్‌కు జోడీగా నటించిన ఈ సినిమాపై తొలిరోజు డివైడ్‌ టాక్‌ వినిపిస్తున్నప్పటికీ.. పెద్ద ఎత్తున విడుదల కావడంతో బాహుబలి యేతర రికార్డులను బద్దలుకొట్టే అవకాశముందని భావిస్తున్నారు.

Tags: ‘YSR’s death is unfortunate’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *