రూ:1.06 కోట్లతో నూతన పోలీస్‌స్టేషన్‌ నిర్మాణం-పూజలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి

– మూడునెలల్లో పనులు పూర్తిచేసేలా చర్యలు
– సర్కిల్‌, పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయాలు
చౌడేపల్లె ముచ్చట్లు:
 
కొన్నేళ్ళుగా అద్దె భవనంలో నిర్వహిస్తున్న పోలీస్‌ స్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయాలకు రూ:1.06 కోట్ల నిధులతో నిర్మాణ పనులను చురుగ్గా జరుగుతున్నాయి. శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు కలిసి కార్యాలయ భవన నిర్మాణపనులను పరిశీలించి, దాలమందరం ఏర్పాటుకు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పక్కా పోలీస్‌ స్టేషన్‌కు కార్యాలయం లేకపోవడంతో సిబ్బంది కష్టాలను గుర్తించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో నిధులను మంజూరు చేశారన్నారు. కాంట్రాక్టర్‌ దామోదరరాజు సహకారంతోపాటు డాక్టర్‌ మురళీ నాయుడు స్థలాన్ని విరాళం మివ్వడంతో నేడు పక్కా భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.నాణ్యత ప్రమాణాలతో పనులను సకాలంలో పూర్తిచే సి మరో మూడునెలల్లో రెండు కార్యాలయాల భవనాలను ప్రారంభోత్సవంకు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మండలంలో అభివృద్దిపనులు వేగవంతం చేయాలని ప్రజాప్రతినిథులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌డిఈ ప్రసాద్‌, ఎస్‌ఐ రవికుమార్‌, సోమల మల్ఖికార్జునరెడ్డి, కోఆప్షన్‌ మెంబరు ఇంమ్రాన్‌,ఎంపీటీసీ శ్రీరాములు,నాయకులు చెంగారెడ్డి,హరి, రఘుస్వామి,శ్రీనివాసులు తదితరులున్నారు.
 
Tags: YSRCP Secretary Peddireddy organized the construction of a new police station at a cost of Rs 1.06 crore

Natyam ad