ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూలును ఆకస్మికంగా సందర్శించిన జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీనివాసులు

బైరెడ్డిపల్లి ముచ్చట్లు:
 
బైరెడ్డిపల్లి మండలము లోని కమ్మనపల్లి నందు గల ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూలును ఆకస్మికంగా సందర్శించి,తరగతి గదులకు వెళ్లి, విద్యార్థులతో ముచ్చటించి, విద్యా బోధన, పారిశుధ్యం, కనీస వసతులు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొన్న జిల్లాపరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు ఈ సంధర్భంగా విద్యార్థులు పలు సమస్యలను జడ్పీ ఛైర్మన్  దృష్టికి తీసుకొని వచ్చినారు.
1. రెసిడెన్షియల్ స్కూల్ నందు 487 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, రాత్రి బస చేయడానికి సౌకర్యాలు లేవని, డార్మెటరీ పాడైపోయినది. అందువలన తరగతి గదులు నందే రాత్రి పూట నిద్రిస్తున్నామని విద్యార్థులు తెలిపినారు. రెసిడెన్షియల్ స్కూల్ నందు ఉన్న భవనములు శిథిలావస్థకు చేరుకొనినవి. టీచర్లు నివసించే గృహములు మాత్రం బాగా ఉన్నవి. టీచర్లు విద్యార్థుల కనీస వసతులు గురించి ఏ మాత్రము పట్టించుకోవడము లేదు.
2.రెసిడెన్షియల్ స్కూల్ లోని మరుగుదొడ్లు, స్నానపు గదులు, త్రాగునీటి కుళాయి వద్ద పరిశుభ్రంగా లేకపోవడాన్ని గమనించి, నిత్యం పారిశుధ్యం గా ఉండాలని రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ ను ఆదేశించినారు. పారిశుధ్యం లేకపోతే విద్యార్థులు అనారోగ్యం పాలవుతారని, అటువంటి పరిస్థితులు తీసుకొని రాకుండా జాగ్రత్తగా ఉండాలని వార్డెన్ ను ఆదేశించినారు.
మధ్యాహ్న భోజన పథకపు వంటగదిని , స్టోర్ రూములను పరిశీలించి, తయారు చేసిన వంటకాలలో అన్నము ముద్దగా ఉన్నది. కుళ్లి పోయిన, పాడైపోయిన కూరగాయలతో వంటకాలను తయారు చేసి విద్యార్థులకు వడ్డించారు. ఈ విషయము పై జడ్పీ ఛైర్మన్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కుళ్లి పోయిన, పాడైపోయిన వాటిని వెంటనే పడవేసి, తాజాగా ఉండే పండ్లు, కూరగాయలను విద్యార్థుల భోజనంలో వాడాలని ప్రిన్సిపాల్, వార్డెన్లు ఆదేశించారు.
కమ్మనపల్లి రెసిడెన్షియల్ స్కూల్ నందు ప్రతిచోటా పారిశుధ్యం సరిగా లేక పోవడము, ప్రతి పని నందు నిర్లక్ష్య ధోరణి కనపడడం తో జడ్పీ ఛైర్మన్ గారు యుద్ధ ప్రాతిపదికన విద్యార్థులకు కనీస సౌకర్యాలు, వసతులు, భోజనము వెంటనే ఏర్పాటుచేయవలయునని ప్రిన్సిపాల్ ను, వార్డెన్లు ను ఆదేశించినారు.ఈ తనిఖీ నందు వీరితోపాటు ప్రిన్సిపాల్ . E. R. శోభ, డిప్యూటీ వార్డెన్ . కిరణ్ కుమార్ , సిబ్బంది, విద్యార్థులు పాల్గొనినారు.
 
Tags:Zilla Parishad Chairman Srinivasan pays a surprise visit to Andhra Pradesh Residential School

Natyam ad