అజ్ఞాతవాసిగా ఐఐటీ గ్రాడ్యుయేట్‌..

16/1/2018 సాక్షి, ముంబయి :  ఐఐటీ బాంబే నుంచి కెమికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ..అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగం..సంప్రదాయ కుటుంబం.. అన్నిటినీ వదిలేసిన సంకేత్‌ పరేఖ్‌ భిన్న ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ అమెరికాలో పీజీ కోర్సు చేయాలని కలలుగన్న సంకేత్‌ తన సీనియర్‌తో చేసిన ఆన్‌లైన్‌ చాట్‌తో అన్నీ తలకిందులయ్యాయి. సర్వం త్యజించి ఈనెల 22న ముంబయిలో సంకేత్‌ జైనిజం స్వీకరించేందుకు ముహుర్తం ఖరారైంది.

వైష్ణవ కుటుంబానికి చెందిన సంకేత్‌ ఐఐటీలో తన సీనియర్‌, 2013లో దీక్ష తీసుకున్న భవిక్‌ షా బాటలో జైనిజంలో అడుగుపెడుతున్నాడు. ఉద్యోగంలో కొనసాగదలుచుకుంటే తాను కోరుకున్నవన్నీ పొందేవాడిననీ..అయితే తనలో చెలరేగిన మానసిక సంఘర్షణ ఇప్పటికి శాంతించిందని సంకేత్‌ చెప్పుకొచ్చాడు.

తాను ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పటి నుంచీ సీనియర్‌ భవిక్‌తో చాట్‌ చేస్తుండేవాడినని, తమ సంభాషణలు క్రమంగా ఆత్మ, మనసు, శరీరం చుట్టూ తిరిగేవని, ఆ ఆలోచనలు తనను ఆత్మాన్వేషణ వైపు పురిగొల్పి..జైనిజం వైపు నడిపాయని అన్నాడు. ప్రస్తుతం సంకేత్‌ పరేఖ్‌  తన వస్తువులను చివరికి స్నేహితుడితో చాట్‌ చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్‌ను సైతం విడిచిపెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *