అప్పుడే ఆవిరి..

Date:15/03/2018
కడప ముచ్చట్లు:
జిల్లాలో వేసవి ఎండలు ముదురుతున్నాయ్‌.. వేడిమి తీవ్రత పెరిగే కొద్దీ భూగర్భంలో జలాలు అడుగంటిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో తాగునీటి కొరత తెరపైకొస్తోంది. గత వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి.. మరికొన్ని చోట్ల అనావృష్టి పరిస్థితి నెలకొంది. ఏటా జనవరి నుంచే ప్రణాళికలతో అప్రమత్తమయ్యే జిల్లా యంత్రాంగం ఈ సారి మరుగుదొడ్ల నిర్మాణమే ఏకైక లక్ష్యంగా  అధికారులు ఉన్నారు.  క్షేత్రస్థాయిలో తాగునీటి వనరుల బాగోగులు చూసేందుకు అధికారులకు సమయం కన్పించడం లేదు.  మార్చి నెల మధ్యకు చేరుకొనేలోపే జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రత గ్రామీణులను చుట్టుముట్టే ప్రమాదం ఉంది.జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాల్లో కడప ప్రథమ, ద్వితీయ స్థానాలలో   ఉంటుంది. జిల్లాలో ఐదు నెలలుగా పుడమిపై నీటి చుక్క రాలిన దాఖలాలు లేవు. నీటిని నిలువరించే జల వనరులు జిల్లాలోని కొన్ని మండలాలలో నీటితో పుష్కలంగా నిండగా మరికొన్ని ప్రాంతాలలో ఒట్టిపోయి నెర్రెలను తలపిస్తున్నాయి. జిల్లాలో వేసవి ఎండలు మార్చి మొదటి వారంలోనే 40 సెంటీగ్రేడులకు చేరుకున్నాయి. మరో పదిహేను రోజుల్లో ఈ ఉష్ణోగ్రత 42-45 మధ్యకు చేరుకునే అవకాశం ఉంది. జిల్లాలోని జలాశయాలు, నదులు, వంకలు, వాగులు, బావులలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతుంది. జిల్లాలోని 51 మండలాలలో 796 పంచాయతీలు ఉన్నాయి.వీటి పరిధిలో 965 రెవెన్యూ గ్రామాలలో 4,761 కుగ్రామాలు ఉన్నాయి. 13,079 చేతి పంపులు ఉండగా, 4429 (పీసీఎండబ్ల్యు), మరో 20 వరకు సీపీడబ్ల్యు నీటి పథకాలు ఉన్నాయి. వీటి ద్వారానే 28,84,524 మందికి పైబడిన గ్రామీణ జనానికి తాగునీటి సరఫరా అవుతోంది. జిల్లాలోని నగరపాలికతో పాటు 8 పురపాలికలకు జలాశయాలు, పెన్న, చెయ్యేరు వంటి నదుల నుంచి నీరు సరఫరా అవుతోంది. ఇక్కడి నుంచి సరఫరా అయ్యే నీరు చాలా వరకు వృథా అవుతోంది. గ్రామాలలో ఏ ఒక్క ఇంటికి నీటి కుళాయికి మూతలు లేకపోవడం, పట్టణాలలోని నీటి కనెక్షన్లకు అనుమతి లేకున్నా మోటార్లు వేసి నీటిని తోడేస్తున్నారు. వేసవి భద్రత చర్యల్లో భాగంగా అధికారులు పథకాలను పర్యవేక్షించి గ్రామాలలో నీటి వాడకంపై అవగాహన తీసుకురావాల్సి ఉంది.
జిల్లాలో ప్రధానంగా భూగర్భజలాల వృద్ధికి తోడ్పడే పథకాలు లేవు. పెన్నా, చెయ్యేరు, మాండవ్య, పింఛ, బహుదా, పాపఘ్ని, కండలేరు, కుందు వంటివి వర్షాకాల నదులే. ఈ వనరులలో గత ఖరీఫ్‌లో కురిసిన వర్షాలకు నీటి మట్టం కొంత మేర పెరిగింది. ప్రస్తుతం నీటి వాడకం అధికంగా ఉంటోంది. రెండు నెలల్లోనే నీటి నిల్వల్లో భారీ తేడాలొచ్చాయి. ఇసుకు అక్రమ రవాణాతోనూ భూగర్భ నీటి మట్టం తగ్గిపోతోంది. నీటి సమస్య తలెత్తే ప్రాంతాలలో తొలుత గుర్తొచ్చేది బద్వేలు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పోరుమామిళ్ల, పులివెందుల, కమలాపురం ప్రాంతాలు ఉన్నాయి.
ప్రమాదాన్ని పసిగట్టాల్సిందే..
ఈ వేసవిలో నీటి కొరతను అధిగమించేందుకు క్షేత్రస్థాయి నుంచి ప్రాథమిక స్థాయి నివేదికలు తెప్పించుకొన్నారు. వాటిని క్షేత్రంలో అమలు చేసేందుకు అవసరమైన నిధుల మాట ఊసెత్తలేదు. జిల్లాకు నీటి ఎద్దడి నివారణకు ఏటా రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోయినా స్థానిక సంస్థలు, ఇతర ప్రత్యేక నిధులను అత్యవసరాలకు వినియోగించే అధికారం కలెక్టరుకు ఉండడంతో వాటితోనే సరిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది.గ్రామాలకు ట్యాంకర్లు, అద్దె బోర్ల నుంచే నీటిని సరఫరా చేయాల్సి ఉంటోంది. ఇందుకు ముందస్తుగానే నీటి లభ్యత ఉన్న రైతు బోర్లను గుర్తించి నీటిని గ్రామాలకు ఇచ్చేందుకు ఒప్పించాల్సి ఉంది.యంత్రాంగం పథకాలను పర్యవేక్షించి గ్రామాలలో నీటి వాడకంపై అవగాహన తీసుకురావాల్సి ఉంది.  బోరు బావుల్లో తగ్గుతున్న నీటి మట్టం : జిల్లాలో ప్రధానంగా భూగర్భజలాల వృద్ధికి తోడ్పడే పథకాలు లేవు. పెన్నా, చెయ్యేరు, మాండవ్య, పింఛ, బహుదా, పాపఘ్ని, కండలేరు, కుందు వంటివి వర్షాకాల నదులే. ఈ వనరులలో గత ఖరీఫ్‌లో కురిసిన వర్షాలకు నీటి మట్టం కొంత మేర పెరిగింది. ప్రస్తుతం నీటి వాడకం అధికంగా ఉంటోంది. రెండు నెలల్లోనే నీటి నిల్వల్లో భారీ తేడాలొచ్చాయి. ఇసుకు అక్రమ రవాణాతోనూ భూగర్భ నీటి మట్టం తగ్గిపోతోంది. నీటి సమస్య తలెత్తే ప్రాంతాలలో తొలుత గుర్తొచ్చేది బద్వేలు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పోరుమామిళ్ల, పులివెందుల, కమలాపురం ప్రాంతాలు ఉన్నాయి.ఈ వేసవిలో నీటి కొరతను అధిగమించేందుకు క్షేత్రస్థాయి నుంచి ప్రాథమిక స్థాయి నివేదికలు తెప్పించుకొన్నారు. వాటిని క్షేత్రంలో అమలు చేసేందుకు అవసరమైన నిధుల మాట ఊసెత్తలేదు. జిల్లాకు నీటి ఎద్దడి నివారణకు ఏటా రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోయినా స్థానిక సంస్థలు, ఇతర ప్రత్యేక నిధులను అత్యవసరాలకు వినియోగించే అధికారం కలెక్టరుకు ఉండడంతో వాటితోనే సరిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది.గ్రామాలకు ట్యాంకర్లు, అద్దె బోర్ల నుంచే నీటిని సరఫరా చేయాల్సి ఉంటోంది. ఇందుకు ముందస్తుగానే నీటి లభ్యత ఉన్న రైతు బోర్లను గుర్తించి నీటిని గ్రామాలకు ఇచ్చేందుకు ఒప్పించాల్సి ఉంది.
Tags: Then steam ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *