ఆక్సిజన్‌ కొరత రానివ్వొద్దు- జగన్‌

Date:04/05/2021

అమరావతి ముచ్చట్లు:

వైద్య ఆరోగ్యశాఖకు ఎట్టిపరిస్థితుల్లో నిధుల కొరత రానివ్వొద్దని సీఎం జగన్‌ అధికారుల్ని ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు- నేడు పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో భూసేకరణపై కలెక్టర్లతో మాట్లాడాలని సూచించారు. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీల టెండర్లు పూర్తయ్యాయన్న అధికారులు.. మిగిలిన 12 కళాశాలలకు ఈ నెల 21లోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వైఎస్సార్‌ కంటివెలుగు పథకంపైనా సీఎం సమీక్షించారు. ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, అవసరమైన వారికి ఆపరేషన్లు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా చేసిన పరీక్షలు, అందించిన అద్దాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

ప్రైమరీ కాంటాక్టులను గుర్తించండి….

కరోనా నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పైనా సమీక్షించిన ముఖ్యమంత్రి.. పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ ఆంక్షలు విధించాలన్నారు. వ్యాపారులు, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

పుంగనూరులో 6న డిపో ప్రారంభంపై కలెక్టర్‌ పరిశీలన

Tags: No te quedes sin oxígeno- fotos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *