ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే బాధ్యత

Date:22/04/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.మాకు కేటాయించిన ఆక్సిజన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఇవ్వాలన్నారు. కేంద్రం ఆక్సిజన్ సప్లై చేయడం లేదన్నారు. ఎవరైనా సరే ఆక్సిజన్ బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. కేంద్రం తీరు చాలా బాధాకరమన్నారు. కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను కేంద్రం పరిధిలోకి తీసుకుందన్నారు.ఇతర రాష్ట్రాల పేషెంట్లకు కూడా మన రాష్ట్రంలో వైద్యం అందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కేవలం తెలంగాణ ప్రాంత రోగులే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కర్ణాటక రోగులు కూడా చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని ఈటల కోరారు. రెమ్‌డెసివర్ కొరత రాకుండా 4 లక్షల డోసులు ఆర్డర్ పెట్టామన్నారు.ది రోజుల్లో గుజ‌రాత్‌కు ఒక ల‌క్షా 63 వేలు, మ‌హారాష్ర్ట‌కు 2 ల‌క్ష‌ల డోసులు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు 92 వేలు, ఢిల్లీకి 63 వేల డోసుల రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్లు పంపిణీ చేస్తే, తెలంగాణ‌కు 25 వేల డోసులు మాత్ర‌మే ఇచ్చింద‌న్నారు. క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల కొర‌త రాకుండా చూడాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేర‌కు 2 ల‌క్ష‌ల వ‌య‌ల్స్‌కి ఆర్డ‌ర్ పెట్ట‌డం జ‌రిగింది.దేశంలో అత్య‌ధిక కేసులు మ‌హారాష్ర్ట‌లో న‌మోదు అవుతున్నాయి. ఏపీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట నుంచి రోగులు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున‌.. రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల‌ను పెంచాల‌న్నారు. రోగులెవ‌రికీ ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని, 4 ల‌క్ష‌ల రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చామ‌న్నారు. 4 ల‌క్ష‌ల డోసులు వ‌స్తాయ‌ని ఆశిస్తే కేంద్రం పిడుగుపాటు వార్త అందించింది. వాక్సిన్‌ను త‌మ ప‌రిధిలోకి తీసుకున్న‌ట్టే రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల పంపిణీ కూడా త‌మ ప‌రిధిలోనే ఉంటుంద‌ని కేంద్రం తెలిపింది. తెలంగాణ‌కు 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు 21,551 వ‌య‌ల్స్‌ను మాత్ర‌మే కేటాయించారు. దీనిపై త‌క్ష‌ణ‌మే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌తో మాట్లాడాను. దీనిపై కేంద్రానికి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నాం అని తెలిపారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఈ క‌ష్ట‌కాలంలో ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌మ రాష్ర్టంలో ఉత్ప‌త్తి అవుతున్న రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల‌ను ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు సంపూర్ణంగా కేటాయించాల‌ని కేంద్రానికి లేఖ రాస్తామ‌ని తెలిపారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:The center is responsible for oxygen shortages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *