క్రీడలతో మానసిక ఉల్లాసం

Date:15/07/2019

ఒంగోలు ముచ్చట్లు:

విద్యార్ధి దశలోనే మంచి  విజ్ఞానాన్ని,  సత్పృవర్తనను, గుండెధైర్యాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ విద్యార్ధులకు సూచించారు. సోమవారం ఉదయం స్ధానిక జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన 30వ ప్రాంతీయ బాడ్మింటన్ పోటిలు-2019 ప్రారంభోత్సవ  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో విద్యార్ధులు కీలక పాత్ర పోషించాల్సి వుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో విద్య నభ్యసిస్తున్న విద్యార్ధులకు  నాణ్యమైన విద్య అందించాల్సి వుందన్నారు. భవిష్యత్తులో మంచి వ్యక్తిగా, నాయకుడిగా ఎదగడానికి  విజ్ఞానం, మంచి నడవడిక, సాహసగుణం  అనే మూడు లక్షణాల ఎంతో అవసరమని అన్నారు.

 

 

 

 

ఈ మూడు లక్షణాలు విద్యాలయాలో పొందాలని సూచించారు. సమాజంలో గౌరవప్రదంగా, సంతోషదాయకంగా జీవించడానికి  ఈ మూడు లక్షణాలు కావాలన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో మంచి నాణ్యమైన విద్యతోపాటు మంచి సంస్కారాన్ని సాధించుకోవాలని కలెక్టర్ విద్యార్ధులకు సూచించారు.  క్రీడా పోటిలో, సాస్కతిక కార్యక్రమాల వలన మానసిక ఉల్లాసంతోపాటు ఆరోగ్యంగా వండే అవకాశం
వుందని క్రీడాపోటీలలో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అలాగే మంచి ప్రదర్శన అందించాలని ఆయన  విద్యార్ధులకు సూచించారు.

 

 

 

జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ జయశ్రీ కార్యక్రమానికి అధ్యక్షత వహించి  మాట్లాడుతూ 30 రీజనల్ బాడ్మింటన్ మీట్-2019 పోటిలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి జవహర్ నవోదయ విద్యాలయ సంస్థల విద్యార్ధులు పోటిలో పాల్గొననున్నారని వివరించారు. పోటిలో పాల్గొనే రాష్ట్రాలను 8 క్ల స్టర్లు గా చామరాజనగర్, హవేరి, కొట్టాయం, మాహె, నల్గొండ, పుదుచ్చేరి, రాయుచూరు, విజయనగరంగా 8 విభజించడం జరిగిందని ఆమె వివరించారు.

 

 

 

 

30వ రీజనల్ బాడ్మింటన్ మీట్ 2019 పోటిలు ఈ నెల 15వ తేది నెండి 17వ వ తేదీ వరకు నిర్వహించబడతాయని, గెలుపొందిన విద్యార్ధులు .ఆతీయ స్ధాయిలో పంజాబ్ లోని జలందర్ లో సెప్టెంబర్ 9 నుండి 11వ తేది వరకు నిర్వహింపబడే పోటీలలో పాల్గొననున్నారని ఆమె వివరించారు.కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, జవహర్ నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపల్  కె.శ్రీనివాసులు, పాండురంగారావు , విద్యాలయ ఉపాధ్యాయలు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

రోగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలి

Tags: Mental exhilaration with sports

ప్రపంచ కప్ లో నేడు భారత్ మ్యాచ్

Date:02/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

ఐసీసీ 2019 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో నేడు బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్

మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం స్టార్ స్పోర్ట్స్ దూరదర్శన్ నెలలో ప్రత్యేక ప్రసారం

ఈరోజు జరిగే మ్యాచ్ లో భారత్ తప్పనిసరిగా గెలవవలసి ఉంటుంది లేకపోతే సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి

బంగ్లాదేశ్ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన తో వరల్డ్ కప్ లో తనదైన శైలితో ముద్ర వేసుకుంది

గతంలో ఒకసారి 2007 ప్రపంచ కప్ లో భారత్ పై గెలిచిన ఘనత బంగ్లాదేశ్ కు ఉంది

బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేస్తే భారత్ కు భంగపాటు తప్పదని భారత క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు

భారత్ తప్పనిసరిగా గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాలని భారత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

శాంతిపురం లో తీవ్ర ఉద్రిక్తత.

Tags: India match today in the World Cup

క్రీడలకు ప్రోత్సహం

Date:25/06/2019

కర్నూలు ముచ్చట్లు:

క్రీడాకారునికి ప్రపంచ వ్యాప్తంగా  గుర్తింపు వుంటుందని ప్రతి విద్యార్ధి క్రీడాస్పూర్తిని అలవర్చుకోవాలని శాసనమండలి సభ్యులు  కె.ఇ ప్రభాకర్ అన్నారు. మంగళవారం స్థానిక  అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన 33వ ఒలంపిక్  క్రీడోత్సవాలలో  ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పాణ్యం, కోడుమూరు ఎమ్మేల్యేలు కాటపాని రాంభూపాల్  రెడ్డి, డా. జే.సుధాకర్ , కెడిసిసి చైర్మన్ మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మేల్యే ఎస్.వి. మోహన్ రెడ్డి, జిల్లాక్రీడాభివృద్ది అధికారి అధినారాయణ, డిఇఓ  తెహరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కె.ఈ ప్రభాకర్ మాట్లాడుతూ  విద్యార్ధులందరూ   చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే  కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల  నుండి  ఒలింపిక్   డే రన్  నిర్వహించు  కుంటున్నామన్నారు.  పార్టీల కతీతంగా సభ్యులందరూ పాల్గొనడం  శుభదాయకమన్నారు. ప్రతి  పాఠశాలలో విద్యార్ధులుఆడుకునేందుకు అవకాశం కల్పించాలని డిఇఓను సూచించారు. పిల్లలు  శారీరకంగా ఎదుగుదల వుంటేనే  చదువులో ఉన్నత స్థితికి చేసుకుంటారన్నారు. రాజకీయ నాయకుల కంటే క్రీడాకారునికి మంచి క్రేజ్ వుంటుందన్నారు. కోడుమూరు ఎమ్మేల్యే డా.జే.సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేద విద్యార్ధులకు అనేక సౌకర్యలు కల్పిస్తున్న నేపథ్యంలో  క్రీడలకు సంబంధిత అంశాల్లో సమస్యలుంటే తన దృష్టికి తేవాలని పాఠశాలల సూచించారు. అంతకుముందు  జాంయిట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి క్రీడా జ్యోతితో ఒలింపిక్ డే రన్ విద్యార్ధులకు ప్రోత్సహమిచ్చారు.

 

పట్టపగలే దారుణ హత్య

 

Tags: Promotion to sports

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూను నియమించాలి

Date:23/06/2019

 

విజయవాడ ముచ్చట్లు:

 

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూను ఏపీ క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరతానని క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.ఆదివారం ఉదయం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ జరిగింది.మహాత్మా గాంధీ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీవీ మానర్ హోటల్‌ వరకు రన్ ప్రారంభమైంది.మంత్రులు ధర్మాన కృష్ణ దాస్, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖహాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒలింపిక్ రన్‌లో క్రీడాకారులు అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు.

 

 

ఒలింపిక్ అసోసియేషన్‌లో గత నాలుగేళ్లల్లో ఎన్నో రాజకీయాలు, వివాదాలు నడిచాయన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకగ్రీవంగా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.నూతన ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి, అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణ దాస్‌ను ఎన్నుకోవడం జరిగిందన్నారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాతే తన దినచర్య పాటిస్తారని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.జగన్ అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి ఆయనలో ఉన్న ఫిట్‌నెస్ ఒక కారణమన్నారు.క్రీడలకు సీఎం ఎంతో ప్రాధాన్యత ఇస్తారని ఏపీకి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తామన్నారు.విద్యార్దులకు చదువుతో పాటు క్రీడలను కూడా తప్పనిసరి చేయాలన్నారు.అంతటితో ఆగని ఆయన.. తెలంగాణలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారంటే.. ‌వారిలో ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ లేకపోవటం కూడా ఒక కారణమన్నారు.అందుకే పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని మంత్రి అవంతి చెప్పుకొచ్చారు.

 

 

 

 

 

కార్యక్రమంలో భాగంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ.. ఒలింపిక్ డే రన్ ద్వారా క్రీడలపై మరింత ఆసక్తిని పెంపొందిస్తామన్నారు.క్రీడల ద్వారానే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కుతుందన్నారు.ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ సాధించాలంటే క్రీడలు ఎంతో అవసరమని.. తాను కూడా క్రీడాకారునిగా ఉంటూ ఉద్యోగం కూడా సంపాదించానన్నారు.క్రీడలను ప్రోత్సహించే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా ఉండటం మన అదృష్టమన్నారు.ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులకు అవసరమైన చేయూతను ఇస్తుందని మంత్రి ధర్మాన చెప్పుకొచ్చారు.

 

 

Tags: Indian badminton star PV Sindhu to be appointed

బ్యాట్మెంటెన్‌లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు

Date:05/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఫ్రెండ్స్ షెటిల్‌ ఆసోసియేషన్‌, చిత్తూరు జిల్లా బ్యాట్మెంటెన్‌ ఆసోసియేషన్‌ సంయుక్తంగా విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రతినిధులు డాక్టర్‌ శరణ్‌ , మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో కోచ్‌ ప్రబాకర్‌ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన సాయివిఘ్నేష్‌, విష్ణు, లలిత్‌, జోషిత్‌, బాష్య, వేదసంహిత, జయసృజిత, నేహ, వెంకటసాయికి సర్టిపికెట్లు, మెమెంటోలు అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శరణ్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, టోర్నమెంట్లకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడల్లో బాగస్వామ్యులను చేయాలని , దీని ద్వారా క్రీడా రిజర్వేషన్లతో ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు వీలుందన్నారు.

కాలుష్య నివారణ , చట్టాలపై అవగాహన ఎంతో అవసరం

Tags: Gifts for students who won in the batmenton

వేసవిలో కరాటే శిక్షకులకు సర్టిఫికెట్లు

Date:05/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మదర్‌థెరిస్సా పాఠశాలలో కరాటే మాస్టర్‌ రామచంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవిలో కరాటే శిక్షణ ఇచ్చారు. బుధవారం శిక్షణ పొందిన 50 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను , బెల్ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ వేసవిలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులలో తిరిగి పోటీ నిర్వహించి, వారిని జిల్లా, అంతర్‌ జిల్లాల పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో మాస్టర్లు దివ్య, అప్సర, సునీల, మంజు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటిలో మొత్తం ఓటర్లు: 38,656

Tags: Certificates for karate trainers in the summer

తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

నేపాల్‌లో జరిగిన కరాటేలో విజేతలైన విద్యార్థులు

Date:21/05/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 7 మంది విద్యార్థులు అంతర్జాతీయ కారాటే పోటీలలో విజయం సాధించి, కప్పు, మెడల్స్ సాధించినట్లు సంఘ అధ్యక్షుడు రామచంద్ర మంగళవారం తెలిపారు. ఈనెల 17 న నేపాల్‌ దేశంలోని ఖట్మాండులో అంతర్జాతీయ కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆంధ్రరాష్ట్రం నుంచి 59 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరిలో పట్టణానికి చెందిన దివ్య ప్రధమ, తృతీయ స్థానాలు సాదించింది. అలాగే టి.హానిఫ్‌, ఎం.వేద అభిషేకరెడ్డి , ఎస్‌.ఉదయ్‌కిరణ్‌, వి.తేజస్‌కుమార్‌, వి.తరుణ్‌కుమార్‌, ఎ.రెడ్డిదీక్షిత్‌ లు విజేతలుగా నిలిచి, కప్పులు, మెడల్స్ సాధించినట్లు రామచంద్రా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు , కరాటే మాస్టర్లు సదాశివ, సునిల్‌, మంజునాథ్‌లు విజేతలైన విద్యార్థులను అభినందించారు.

 

 

పేదముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ

Tags: Winner students at karate in Nepal