క్రీడలను ప్రోత్సహించాలి

Date:20/05/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

విద్యార్ధుల్లో క్రీడా స్ఫూర్తి కలిగించాల్సిన అవసరం వుందని తెలంగాణ గురుకుల విద్యాలయాల డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  జర్నలిస్టు మురళీ మోహన్ రాసిన ‘రూల్స్ ఆఫ్ ది గేమ్’ పుస్తకాన్ని అయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన  మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రీడలలో పాల్గోంటే మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం కలుగుతుందని అన్నారు.  క్రీడల వల్ల యువతలో పట్టుదల, ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని అన్నారు.  హై స్కూలు విద్యార్ధి దశ నుంచే క్రీడల పట్ల ప్రోత్సహం అందించాలని తాము కృషి చేస్తున్నట్లు అయన అన్నారు.

 

యువకుడిని ఢీకొన్న కారు

 

Tags: Sports should be encouraged

సేవాలాల్‌ టి-20 క్రీకెట్‌ పోటీలలో విజేతలు తాండ టీమ్‌

Date:15/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాలలోని తాండాలలో ఐదు రోజులుగా జరుగుతున్న క్రీకెట్‌ పోటీలు మంగళవారంతో ముగిశాయి. 17 టీములు పాల్గొనగా అందులో మదనపల్లెకు చెందిన నారమార్కులతాండ టీమ్‌ వెహోదటి బహుమతి రూ.12,116లు కైవసం చేసుకున్నారు. అలాగే మండలంలోని పెద్దతాండ టీమ్‌ రన్నర్స్గా రెండవ బహుమతి రూ.7,116లు గెలుపొందారు. వీటిని సీఐ నాగశేఖర్‌ క్రీడాకారులకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు డెవలెప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు బుక్యా బానుప్రసాద్‌ మాట్లాడుతూ తాండాలో సేవాలాల్‌ టి-20 క్రీకెట్‌ పోటీలు నిర్వహించి తాండాలలో క్రీ డలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు.ప్రతియేటా ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండా వాసులు వడివేలునాయక్‌, వెంకట్రమణ, బీమానాయక్‌, రవీంద్రనాయక్‌, శివనాయక్‌, శీన నాయక్‌, రామయ్యనాయక్‌, అర్జున్‌నాయక్‌, ప్రసాద్‌నాయక్‌, మునిరె డ్డినాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, జగదీష్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Tags: Winner Tandon Team at the Sevallal T20 Championship

నేపాల్‌లో కరాటే పోటీలకు వెళ్లి విద్యార్థులు

Date:12/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అంతర్జాతీయ కారాటే పోటీలలో పాల్గొనేందుకు నేపాల్‌ దేశంలోని కాఠ్‌మాండూ దేశంకు వెళ్లారు. ఆదివారం ఈ విషయాన్ని సంఘ అధ్యక్షుడు రామచంద్ర తెలిపారు. పట్టణంలోని విద్యార్థులు వేదఅభిషేక్‌, అనీఫ్‌, దివ్య, తేజస్‌కుమార్‌, ఉదయ్‌కిరణ్‌, దీక్షిత్‌, మహమ్మద్‌రెహల్‌ లు వెళ్లారు. ఈనెల 15 నుంచి 17 వరకు అంతర్జాతీయ కరాటే పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల వెంట కరాటే మాస్టర్లు సదాశివ, సునిల్‌, మంజునాథ్‌లు వెళ్లారు.

 

పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లయన్స్ క్లబ్ లక్ష్యం

 

Tags; Students in karate competitions in Nepal

ఫైనల్స్ కు ఉప్పల్ స్టేడియం రెడీ

Date:11/05/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. స్టేడియం లోపలి పరిసరాల్లో 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు, స్టేడియం లోపల ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2,800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్టేడియంతో పాటు, పిచ్ ను కూడా ఇప్పటికే తనిఖీ చేశామని తెలిపారు. సిగరెట్లు, ల్యాప్ టాప్, మద్యం, హెల్మెట్, పవర్ బ్యాంక్, తిండి పదార్థాలు, బయట నుంచి మంచి నీటి బాటిల్స్ ను తీసుకురావద్దని ప్రేక్షకులకు సూచించారు.
Tags: Uppal stadium to the finals will

అర్జున అవార్డుకు నలుగురి పేర్లను ప్రతిపాదించిన బీసీసీఐ

Date:27/04/2019
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, జస్‌ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, నమ్ యాదవ్ పేర్లను ప్రతిష్టాత్మక అర్జున అవార్డ్‌కు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన సిఫార్సును భారత ప్రభుత్వానికి పంపించింది. కాగా అర్జున అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించిన క్రికెటర్లలో ముగ్గురు పురుషుల జట్టుకు చెందిన వారు కాగా మహిళా జట్టు నుంచి పూనమ్ యాదవ్‌ ఎంపిక కావడం విశేషం.
Tags: BCCI has nominated four names for Arjuna award

ఐపీఎల్‌ నుంచి 18 మంది విదేశీ క్రికెటర్లు వారంలో ఔట్..!

Date:24/04/2019
ముంబై ముచ్చట్లు:
ఐపీఎల్ 2019 సీజన్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగలబోతోంది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టోర్నీగా విరాజిల్లుతున్న ఐపీఎల్.. తాజా సీజన్‌లో మాత్రం ఆఖర్లో ఢీలాపడనుంది. మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మే నెల ఆరంభంలోనే స్వదేశానికి వచ్చేయాలని ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆటగాళ్లని ఆదేశించాయి. దీంతో.. మరో వారంలో దాదాపు 18 మంది విదేశీ క్రికెటర్లు భారత్‌ని వీడనున్నారు. అయితే న్యూజిలాండ్ క్రికెటర్లు మాత్రం టోర్నీ ముగిసే వరకూ భారత్‌లోనే ఉండనుండగా.. వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదు..!
1. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ స్వదేశానికి వెళ్లనున్నారు. ఓపెనర్‌గా డుప్లెసిస్ జట్టుకి మెరుగైన ఆరంభాలు ఇస్తుండగా.. తాహిర్ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ చెన్నై విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు.
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నుంచి మొయిన్ అలీ, డేల్ స్టెయిన్, స్టాయినిస్, హెన్రిచ్ క్లాసెన్ వెళ్లనున్నారు. వారం క్రితమే బెంగళూరు టీమ్‌లోకి వచ్చిన స్టెయిన్.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక వికెట్లు పడగొట్టి బెంగళూరుకి ఊహించని విజయాల్ని అందించాడు. ఇక మొయిన్ అలీ, స్టాయినిస్ మిడిలార్డర్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. క్లాసెన్ టోర్నీలో ఆడింది తక్కవే..!
3. రాజస్థాన్ రాయల్స్జట్టు నుంచి జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్, స్టీవ్‌స్మిత్, జోప్రా ఆర్చర్ స్వదేశానికి వెళ్లనున్నారు. బట్లర్ ఓపెనర్‌గా రాజస్థాన్‌కి మెరుపు ఆరంభాల్ని ఇస్తుండగా.. మిడిలార్డర్‌లో బెన్‌స్టోక్స్, స్టీవ్‌స్మిత్ జట్టుకి ప్రధాన బలం. ఇక రాజస్థాన్ బౌలింగ్‌ భారాన్ని ఆరంభం నుంచి ఆర్చరే ఎక్కువగా మోస్తున్నాడు.
4. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నుంచి డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, షకీబ్ అల్ హసన్ వెళ్లనున్నారు. తాజా సీజన్‌లో హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో సూపర్ హిట్ జోడీగా నిలిచారు. ఇప్పటికే టోర్నీలో నాలుగు శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఈ జోడీ.. హైదరాబాద్‌కి తిరుగులేని విజయాల్ని అందించింది. ఇక షకీబ్ అల్ హసన్.. తుది జట్టులో చోటు కూడా దక్కించుకోలేకపోతున్నాడు.
5. ముంబయి ఇండియన్స్ టీమ్ నుంచి జాసన్ బెరండ్రాఫ్, డికాక్‌ వెళ్లనున్నారు. ఓపెనర్‌గా డికాక్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తుండగా.. బెరండ్రాఫ్ తన బౌలింగ్‌తో జట్టులో నమ్మదగిన బౌలర్‌గా పేరు దక్కించుకున్నాడు.
6. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నుంచి డేవిడ్ మిల్లర్ వెళ్లనున్నాడు. మిడిలార్డర్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న మిల్లర్.. టీమ్‌లోనే నెం.1 ఫీల్డర్‌గా ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నాడు.
7. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి కగిసో రబాడ వెళ్లనున్నాడు. తాజా సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉన్న రబాడ.. ఢిల్లీ జట్టుకి అసాధారణ విజయాల్ని అందించాడు.
8. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి జో డెన్లీ వెళ్లనున్నాడు. అయితే.. అతను వెళ్లడం వల్ల కోల్‌కతాపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
Tags:Out of 18 foreign cricketers out of IPL

రెండో వన్డేలో భారత్ విజయం

Date:08/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌‌ గెలుపు అవకాశాల్ని భారత్ జట్టు సజీవంగా ఉంచుకుంది.న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగడంతో 159 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. రోహిత్ కేవలం 29 బంతుల్లో 50 పరుగులు చేయగా.. ధావన్ 30, పంత్ 40, ధోనీ 20 పరుగులు చేశారు. తొలి టీ20లో టాపార్డర్ కుప్పకూలడంతో టీమ్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఆ తప్పిదం ఈ మ్యాచ్‌లో జరగకుండా చూశారు రోహిత్, ధావన్. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలోనే 79 పరుగులు జోడించడంతో టీమ్ గెలుపు సులువైంది. నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌ హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుంది. గత బుధవారం జరిగిన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఈరోజు మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్య‌ (3/28)కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. గ్రాండ్ హోమ్ (50: 28 బంతుల్లో 1×4, 4×6), రాస్ టేలర్ (42: 36 బంతుల్లో 3×4) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఛేదనలో శిఖర్ ధావన్‌ (30: 31 బంతుల్లో 2×4)తో కలిసి తొలి వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయానికి రోహిత్ శర్మ బాటలు వేయగా.. ఆ తర్వాత రిషబ్ పంత్ (40 నాటౌట్: 28 బంతుల్లో 4×4, 1×6), మహేంద్రసింగ్ ధోని (19 నాటౌట్: 17 బంతుల్లో 1×4) మరో 7 బంతులు మిగిలి ఉండగానే 162/3తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ బౌలర్లలో కృనాల్ పాండ్య‌ (3/28) పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్ అహ్మద్ (2/27), భువనేశ్వర్ (1/29), హార్దిక్ పాండ్య (1/36) ఫర్వాలేదనిపించారు. కానీ.. 9.25 ఎకానమీతో 37 పరుగులిచ్చిన చాహల్ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు కివీస్‌ కూడా టీమ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య‌, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్ తొలి టీ20‌లో హిట్టర్ టిమ్ సీఫర్ట్ (84: 43 బంతుల్లో 7×4, 6×6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన టీమిండియా 19.2 ఓవర్లలోనే 139 పరుగులకి ఆలౌటైంది.
Tags:India’s victory in the second one-dayer

మళ్లీ ఫామ్ లోకి రోహిత్ శర్మ

Date:08/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారత విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లో 3×4, 4×6 సాయంతో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. పొట్టి క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌లు నెలకొల్పాడు. ఈరోజు 50 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకూ 2,272 పరుగులతో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ అగ్రస్థానంలో ఉండగా.. 2,288 పరుగులతో అతడ్ని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ నెం.1 స్థానానికి ఎగబాకాడు.  మ్యాచ్‌లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. తక్కువ వ్యవధిలోనే టీ20ల్లో ఎక్కువ విజయాల్ని అందుకున్న టీమిండియా కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ నిలిచాడు. ప్రపంచకప్ నేపథ్యంలో.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. కివీస్‌పై టీ20 సిరీస్‌లో జట్టుని నడిపిస్తున్న రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా ఈరోజు 12వ విజయాన్ని అందుకున్నాడు. అతని కెప్టెన్సీలో 14 టీ20లు ఆడిన భారత్ ఏకంగా 12 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. కివీస్‌పై అర్ధశతకం సాధించడం ద్వారా.. టీ20ల్లో అత్యధికసార్లు 50+ స్కోరు సాధించిన క్రికెటర్‌గానూ రోహిత్ శర్మ నిలిచాడు. కెరీర్‌లో 92వ టీ20 మ్యాచ్ ఆడిన ఈ ఓపెనర్ ఇప్పటి వరకూ 20సార్లు 50+ మార్క్‌ని అందుకున్నాడు. ఇందులో 16 అర్ధశతకాలు, నాలుగు శతకాలున్నాయి. మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ.. టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డ్‌లో క్రిస్‌గేల్, మార్టిన్ గప్తిల్ సంయుక్తంగా 103 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 102 సిక్సర్లతో నిలిచాడు.
Tags:Rohit Sharma into the form again