ధోనికి రెండు సార్లు లైఫ్

Date:18/01/2019
మెల్ బోర్న్  ముచ్చట్లు:
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి రెండు సార్లు జీవనదానం లభించింది. క్రీజులోకి వచ్చిన వెంటనే ఇచ్చిన సులువైన క్యాచ్‌ని ఫీల్డర్ మాక్స్‌వెల్ జారవిడచగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే కీపర్ క్యాచ్ ఇచ్చినా.. ఆస్ట్రేలియా టీమ్‌కి స్పష్టత లేకపోవడంతో ఔట్ కోసం సరిగా అప్పీల్ చేయలేదు. దీంతో.. ధోనీకి లైఫ్ లభించింది.
231 పరుగుల లక్ష్యఛేదనలో.. భారత్ జట్టు విజయానికి 128 బంతుల్లో 122 పరుగులు చేయాల్సిన దశలో ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ విసిరిన బంతిని హిట్ చేసేందుకు ధోనీ క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. బ్యాట్‌కి బంతి తాకిందా..? లేదా..? అనే స్పష్టత లేకపోవడంతో బౌలర్‌తో పాటు వికెట్ కీపర్, సమీపంలోని ఫీల్డర్లు ఏదో మొక్కుబడిగా అప్పీల్ చేశారు.
దీంతో.. అంపైర్ స్పందించలేదు. కనీసం వికెట్ కీపర్ గట్టిగా అప్పీల్ చేసుంటే..? అంపైర్ స్పందించేవాడేమో..? అలాకాకున్నా.. కనీసం ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ డీఆర్‌ఎస్‌కి వెళ్లే సాహసమైనా చేసేవాడు..!
Tags: Life twice to Dhoni

ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

Date:18/01/2019
మెల్బోర్న్ ముచ్చట్లు:
ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రక పర్యటనను ఘనంగా ముగించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లిసేన మెరిసింది. లెగ్ స్పిన్నర్ చహల్ బంతితో మాయచేస్తే.. బ్యాట్తో మహేంద్రసింగ్ ధోని(87: 114 బంతులు,6ఫోర్లు నాటౌట్), కేదార్ జాదవ్(61:57బంతులు, 7ఫోర్లు)లు కడవరకు పోరాడి భారత్కు విజయాన్నందించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. చహల్ (6/42) దాటికి  48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. హ్యాండ్స్కోంబ్ (58) అర్ధసెంచరీ మినహా.. అలెక్స్ క్యారీ(5), ఫించ్(14) ఖవాజా (34), షాన్ మార్ష్( 39), మ్యాక్స్వెల్ (26), రిచర్డ్సన్(16), ఫించ్(14), సిడిల్ (10)లు విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో చహల్ 6 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, షమీలు రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. 231 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు వన్డేల్లో రాణించిన ఓపెనర్ రోహిత్ శర్మ (9) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. సిడిల్ బౌలింగ్లో మార్ష్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో శిఖర్ ధావన్ జట్టు స్కోర్ను 50 పరుగులు దాటించాడు. ఈ తరుణంలో శిఖర్ (23), స్టోయినిస్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఎంఎస్ ధోని వచ్చిరావడంతోనే మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చాడు. కానీ మ్యాక్సీ జారవిడచడంతో ధోని ఊపిరి పీల్చుకున్నాడు. ధోనితో కలిసి కోహ్లి ఆచితూచి ఆడుతూ.. మూడో వికెట్కు 54 పరుగులు జోడించాడు. అనంతరం కోహ్లి(46) కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు.
Tags:Australia created history on Australia soil

జాతీయ క్రీడా పోటీలకు మోడల్‌ స్కూల్‌ విద్యార్థి శేషు

Date:18/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

జాతీయ కబడ్డీ పోటీలకు ఆంధ్రరాష్ట్రం తరపున పుంగనూరు మోడల్‌స్కూల్‌కు చెందిన 9 వ తరగతి విద్యార్థి ఇ.శేషు ఎంపికైయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ యోజన విలేకరులకు తెలిపారు. ఈనెల 21 నుంచి 25 వరకు పాట్నలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో శేషు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శేషును ప్రిన్సిపాల్‌ , సిబ్బంది అభినందించారు.

అంటు రోగాలు వ్యాపించకుండ ఉండేందుకే పారిశుద్ధ్యం పనులు

 

Tags; Model School Student Shesh for national sports competitions

చరిత్ర సృష్టించిన టీమిండియా

-భారత్, ఆసీస్ మ్యాచ్ పై ఉత్కంఠ
Date:17/01/2019
మెల్ బోర్న్ ముచ్చట్లు:
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను వారి గడ్డపై గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇప్పుడు మరో రికార్డుపై కన్నేసింది.  ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో టీమిండియా గెలిస్తే కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా గడ్డపై ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలిచిన చరిత్ర టీమిండియాకు లేదు.  గతంలో రెండు సందర్భాల్లో ఆస్ట్రేలియా గడ్డపై వన్డే ఫార్మాట్‌లో సిరీస్‌లు సాధించినప్పటికీ, అవి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు కావు. ఒకటి 1985లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌ టైటిల్‌ కాగా, రెండోది మూడు దేశాలు పాల్గొన్న సీబీ సిరీస్‌.  ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో తొలిసారి ఆసీస్‌ను వారి దేశంలో  ఓడించే అవకాశం టీమిండియా ముంగిట ఉంది.
  ఈ మేరకు కసరత్తులు చేస్తున్న కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ ఆసీస్‌ పర్యటనకు ఘనమైన ముగింపు ఇచ్చే యోచనలో ఉంది.  మెల్‌బోర్న్‌ వేదికగా ఇరు జట్ల మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక వన్డే జరుగనుంది. భారత కాలమాన ప‍్రకారం ఉదయం గం.7.50 ని.లకు మ్యాచ్‌ ఆరంభం కానుంది. భారత్‌-ఆసీస్‌లు తలో వన్డే గెలిచి సమంగా నిలవడంతో మూడో వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి వన్డేలో ఆసీస్‌ 34 పరుగుల తేడాతో గెలవగా, రెండో  వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. రేపటి మ్యాచ్‌లో భారత్‌ గెలిచిన పక్షంలో ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్‌ను కోల్పోకుండా ముగించినట్లు అవుతుంది. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమం కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.ఆసీస్‌తో రెండో వన్డేలో ఆడటం ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఘోరంగా నిరాశపరిచాడు.
అడిలైడ్‌ వన్డేలో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చిన అతను ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. భారత్‌ తరఫున కర్సన్‌ ఘావ్రీ (0/83) తర్వాత అరంగేట్రంలో అతి చెత్త ప్రదర్శన సిరాజ్‌దే కావడం గమనార్హం. దాంతో సిరాజ్‌పై వేటు తప్పేలా కనబడటం లేదు. అతని స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు తప్పితే భారత జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో కేదర్‌ జాదవ్‌ను జట్టులో చోటు దక్కడం కష్టంగానే ఉంది.
ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానంలో కానీ, కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో కానీ కేదర్‌ జాదవ్‌ను తీసుకోవాలి. కాగా, కీలకమైన మ్యాచ్‌కు రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లను తీసే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. అడిలైడ్‌ వన్డేలో కుల్దీప్‌ రాణించనప్పటికీ మెల్‌బోర్న్‌ పిచ్‌ పొడిగా ఉండే అవకాశం ఉండటంతో అతనికే తుది జట్టులో అవకాశం ఖాయంగా కనబడుతోంది. దాంతో పెద్దగా మార్పులు లేకుండానే టీమిండియా ఫైనల్‌ టచ్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉంది.
భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ సిరీస్‌ను వదులుకోకూడదనే యోచనలో ఉన్న ఆసీస్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ వన్డే సిరీస్‌లో ఏమాత్రం ప్రభావం చూపని స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ స్థానంలో ఆడమ్‌ జంపాను తీసుకోగా, పేసర్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ స్థానంలో బిల్లీ స్టాన్‌లేక్ జట్టులోకి వచ్చాడు.‌ ఇక రిజర్వ్‌ ఆటగాడిగా కేన్‌ రిచర్డ్‌సన్‌ను తీసుకున్నారు. ఏది ఏమైనా ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.
Tags; History created by the team

ధోని వ్యూహంతో డిఫెన్స్ లో ఆసీస్

Date:16/01/2019
ముంబై ముచ్చట్లు:
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పక్కా వ్యూహంతోనే రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాడని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. అడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (104: 112 బంతుల్లో 5×4, 2×6) శతకం సాధించగా.. ఆఖర్లో సమయోచితం ఇన్నింగ్స్ ఆడిన మహేంద్రసింగ్ ధోని (55 నాటౌట్: 54 బంతుల్లో 2×6) అర్ధశతకం బాదడంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన విషయం తెలిసిందే. భారత్ జట్టు విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ (25 నాటౌట్: 14 బంతుల్లో 2×4)‌తో కలిసి ధోనీ వరుసగా సింగిల్స్ తీస్తూ ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాడు. తొలుత పరుగులు, బంతుల మధ్య అంతరాన్ని తగ్గించిన ధోనీ.. ఆఖరి ఓవర్‌లో స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించి కళ్లుచెదిరే సిక్స్ బాది భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. జట్టు స్కోరు 242 వద్ద కోహ్లీ ఔటవగా.. మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో ఓపికతో క్రీజులో నిలిచిన ధోనీ.. ఆఖరి వరకూ సహనం కోల్పోలేదు. సింగిల్స్‌తో ఫీల్డర్లపై తొలుత ఒత్తిడి పెంచిన ధోనీ.. ఆ తర్వాత బౌలర్లని ఆత్మరక్షణలోకి నెట్టేశాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్‌తో కలిసి ఐదో వికెట్‌కి అజేయంగా 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ‘ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లో ధోనీ నిలకడగా ఆడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఆఫ్ సెంచరీలు సాధించడం, మునుపటిలా మ్యాచ్‌ని గెలుపుగా ముగించడాన్ని నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి చూసి చాలా ఆస్వాదించా. తొలుత ఒత్తిడిని తట్టుకుని.. ఆ తర్వాత దాన్ని ప్రత్యర్థిపైకి మళ్లించాలనేది ధోనీ వ్యూహం. వాస్తవానికి రెండో వన్డేలో అతని ప్లాన్ సక్సెస్ అయ్యింది. అలా వ్యూహాలు రచించి వాటిని విజయవంతంగా అమలు చేయడంలో ధోనీ సత్తా ఏంటో..? మరోసారి నిరూపితమైంది’ అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.
Tags:Ace in defense with Dhoni strategy

తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకం

Date:12/01/2019
సిడ్ని ముచ్చట్లు:
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకంతో మెరిశాడు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో.. నాలుగో ఓవర్లోనే క్రీజ్‌లోకి అడుగుపెట్టిన మహీ.. రోహిత్ శర్మతో కలిసి ఓపికగా ఆడాడు. 93 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ధోనీ.. 68వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహీ కెరీర్లో నెమ్మదిగా చేసిన రెండో అర్ధ శతకం ఇదే కావడం గమనార్హం. గత ఏడాది ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని మహీ.. ఈ ఏడాది తొలి ఆడిన తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. 14 ఇన్నింగ్స్ విరామం తర్వాత ధోనీకి ఇది తొలి అర్ధ శతకం. ఆచితూచి ఆడిన ధోనీ.. రోహిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. పది పరుగుల్లోపు మూడు వికెట్లు కోల్పోయాక.. నాలుగో వికెట్‌కు నమోదైన రెండో అతిపెద్ద భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం. 1984లో ఆస్ట్రేలియా విండీస్‌పై 150 పరుగులు చేయడమే ఇప్పటి వరకూ అత్యుత్తమం. భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో బెహ్రెన్‌డ్రాఫ్ బౌలింగ్‌లో ధోనీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి అవుట్ సైడ్ పిచ్ అయినా.. అదేమీ పట్టించుకోకుండానే అంపైర్ మైకెల్ గవుఫ్ అవుటిచ్చాడు. టీమిండియా అప్పటికే రెండు రివ్యూలను వృథా చేయడంతో.. మరోసారి డీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోయింది. దీంతో భారత్ కీలకమైన ధోనీ వికెట్ కోల్పోయింది. డీఆర్ఎస్ కోరడంలో కింగ్ అయిన ధోనీ.. నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది
Tags:Mahendra Singh Dhoni’s half century in the first ODI

వన్డే సిరీస్‌ని ఓటమితో ఆరంభించిన భారత్ జట్టు

Date:12/01/2019
సిడ్నీ ముచ్చట్లు:
ఆస్ట్రేలియాకి సొంతగడ్డపై టెస్టులో ఓటమి రుచిచూపిన భారత్ జట్టు.. వన్డే సిరీస్‌ని మాత్రం ఓటమితో ఆరంభించింది. సిడ్నీ వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (133: 129 బంతుల్లో 10×4, 6×6) శతకం బాదినా.. టీమిండియాకి 34 పరుగుల తేడాతో కంగారూల చేతిలో ఓటమి తప్పలేదు. 289 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ‌తో పాటు మహేంద్రసింగ్ ధోని (51: 96 బంతుల్లో 3×4, 1×6) నిలకడగా ఆడినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో ఆఖరికి భారత్ 254/9కే పరిమితమైంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. 110 బంతులు ఆడిన రోహిత్ 4 సిక్స్ లు, 7 ఫోర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. 289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే కీలక వికెట్లని కోల్పోయింది. ఈ దశలో ధోని, రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించారు. 51 పరుగులు పూర్తి చేసిన ధోని బెహ్రెన్డెర్ఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే అడిలైడ్ వేదికగా మంగళవారం ఉదయం 8.50 నుంచి జరగనుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. హ్యాండ్స్‌కబ్ (73: 61 బంతుల్లో 6×4, 2×6), ఉస్మాన్ ఖవాజా (59: 81 బంతుల్లో 6×4), షాన్ మార్ష్ (54: 70 బంతుల్లో 4×4) అర్ధశతకాలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/66), కుల్దీప్ యాదవ్ (2/54) ఫర్వాలేదనిపించారు. 289 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), అంబటి రాయుడు (0) తొలి నాలుగు ఓవర్లలోపే పెవిలియన్ చేరిపోవడంతో భారత్ 4/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ – మహేంద్రసింగ్ ధోని జోడీ.. నాలుగో వికెట్‌కి అభేద్యంగా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకోవడంతో భారత్ ఒకానొక దశలో 140/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ.. జట్టు స్కోరు 141 వద్ద ధోనీ ఔటవగా.. అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్ (12), రవీంద్ర జడేజా (8) నిరాశపరిచారు. అయినప్పటికీ.. ఒక ఎండ్‌లో 46వ ఓవర్ వరకూ పోరాడిన రోహిత్ శర్మ.. కెరీర్‌లో 22వ శతకం పూర్తి చేసుకుని జట్టు స్కోరు 221 వద్ద ఔటయ్యాడు. దీంతో.. భారత్ ఓటమి ఖాయమైంది. అయితే.. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (29 నాటౌట్: 23 బంతుల్లో 4×4) బ్యాట్ ఝళిపించి ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు.
Tags:India squad opener

సిక్సర్లు లేకుండానే ఒక్కో బాల్ లో ఆరు పరుగులు

Date:10/01/2019
ముంబై ముచ్చట్లు:
క్రికెట్‌లో తక్కువ బంతులకు ఎక్కువ రన్స్ కొట్టాల్సిన సందర్భాలు చాలా సార్లు వస్తాయి. అలాంటి మ్యాచ్‌లు భలే ఉత్కంఠ రేకెత్తిస్తాయి. చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైనప్పుడు బ్యాట్స్‌మ్యాన్ సిక్స్ కొట్టి విజయం సాధించడం సాధారణమే. కానీ, బ్యాట్స్‌మ్యాన్ ఒక్క పరుగు కూడా కొట్టకుండా ఆరు పరుగులు సాధిస్తే? భలే చిత్రంగా ఉంటుంది కదూ. మహారాష్ట్రలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో అదే జరిగింది. ఆదర్శ్‌ క్రికెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన మ్యాచ్‌లో దేశాయ్- జుని దొంబివ్లి అనే జట్లు తలపడ్డాయి. 5 ఓవర్లకు 76 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దేశాయ్ జట్టు.. 4.5 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.
విజయం సాధించాలంటే చివరి బంతిలో 6 పరుగులు చేయాలి. దీంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్యాట్స్‌మ్యాన్ 6 కొడితే విజయం తమదే అనే ఆశతో దేశాయ్ జట్టు ఉంది. ఆ ఒక్క బంతితో కట్టడి చేస్తే తామే విజేతలమనే ధీమతో జుని డొంబివ్లి జట్టు ఉంది. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. బౌలర్ చివరి బంతిని వైడ్‌గా వేశాడు. దీంతో లక్ష్యం 5 పరుగులకు తగ్గింది. అయితే, విజయానికి అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆ తర్వాత వేసిన బంతి కూడా వైడ్ అయ్యింది. లక్ష్యం 4 పరుగులకు తగ్గిపోయింది. దీంతో ఇరు జట్లలో టెన్షన్ మరింత పెరిగింది. బౌలర్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే, వైడ్ల పరంపర అంతటితో ఆగలేదు. మిగతా నాలుగు బంతులు కూడా వైడ్లే వేశాడు. దీంతో ఒక బంతి మిగిలి ఉండగానే దేశాయ్ జట్టును విజయం వరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
Tags:Six runs on each ball without the sixes