ఆర్‌ ఆర్ ఆర్ పిటీషన్ పై 27కు విచారణ

Date:22/04/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీరఘురామకృష్ణ రాజు ఈ పిటిషన్ వేశారు.. దీనిపై కోర్టు విచారణ జరపగా.. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు కొనసాగాయి. జడ్జి ఈ నెల 27న పిటీషన్‌ను విచారణ జరపాలా లేదా అన్నదానిపై తీర్పును వెలువరించనున్నారు.. కోర్టు నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠరేపుతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ-1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు. రఘురామ జగన్‌పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషన్‌లో ప్రస్తావించారు. కోర్టు ఈ పిటిషన్‌ను విచారణ జరపాలా లేదా అన్న అంశంపై తీర్పును ఇవ్వనుంది.సీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ అన్నారు. వైఎస్సార్‌సీపీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా తనపై ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలో తిరుపతి ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ చర్చనీయాంశమైంది.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags: Inquiry into 27 on R&R Petition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *