ఆస్ట్రేలియా లో ఘనంగా ప్రారంభం అయిన  అగ్రజీత  

Date:22/04/2021

సినిమా ముచట్లు

రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అగ్రజీత. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా దేశంలో డాండెనాంగ్ సిటీలోని  శివ విష్ణు ఆలయం లో ఘనంగా ప్రారంభించారు. ఈ అగ్రజీత చిత్రాన్ని ఆద్యంతం ఆస్ట్రేలియా లోనే చిత్రీకరిస్తారు.
ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ “అగ్రజీత ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవి లోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. మంచి కథ తో మంచి గ్రాఫిక్ విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రాన్ని మొత్తం ఆస్ట్రేలియా దేశంలోనే చిత్రీకరిస్తాం. రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు.  మా చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ మొదలైయింది” అని తెలిపారు.
బ్యానర్ : సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:Agrajita, who made a solid start in Australia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *