ఉద్యోగాల పేరిట మోసం మహిళపై పోలీసులకు పిర్యాదు

Date:04/05/2021

విశాఖ ముచ్చట్లు:

నెవల్ డాక్ యార్డ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక  మహిళ మోసం చేసిందంటూ బాధితులు నర్సిపట్నం పోలీస్ స్టేషన్ లో  పిర్యాదు చేసారు. నెవల్ డాక్ యార్డ్ లో ఉద్యోగాల పేరిట ఒకొక్కరి వద్దనుండి 3 లక్షలు వసూలుచేసిన మహిళ, తమకు ఉద్యోగం ఇప్పించక పోగా తాము కట్టిన డబ్బులులైన ఇవ్వమంటే ఇవ్వడం లేదంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేసారు.
నర్సీపట్నం మండలం గబ్బాడా గ్రామంకు చెందిన మడ్ఫు యజ్ఞేశ్వరవు,బొంతుమల్లేశ్వరరావు, నర్సీపట్నం బిసి కాలనీ, కోటవురట్ల కు చెందిన 10మంది వరకు తమ స్నేహితులకు నేవల్ డాక్ యార్డ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద నుండి 3 లక్షలు వసూలు చేసారంటూ నర్సీపట్నం టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో పిర్యాదుచేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గబ్బాడా గ్రామంకు చెందిన కన్నూరు శివలక్ష్మీ తన భర్త రాజు నాయుడు  తన భార్య నేవల్ డాక్ యార్డ్ లో ఉద్యోగం చేస్తుందని నమ్మబలికి మీకు అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు కట్టించుకున్నారన్నారు. డబ్బులు కట్టి ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో వారిని అడుగగా కట్టినవాటిలో కొంతమొత్తం ఇచ్చారని మిగిలిన మొత్తం ను అడుగగా వారు మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. వారి గురించి నేవల్ డాక్ యార్డ్ లో విచారణ చేయగా శివలక్ష్మి కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం చేసేదని ఇప్పుడు ఉద్యోగం కూడా చెయ్యడం లేదని తెలిపారు. తమకు న్యాయం చెయ్యాలని తమలాగా ఎవ్వరు మోసపోకుండా వుండే విధంగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిర్యాదు చేసినట్లు తెలిపారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:The woman complained to the police about cheating in the name of jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *