ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్   పర్యటన 

అనంతపురము ముచ్చట్లు:

పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని సాయి ఆరామం నందు  రాష్ట్ర ఆరోగ్యం; కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖా మంత్రి   సత్య కుమార్ యాదవ్ ,  రాష్ట్ర బీసీ సంక్షేమం; ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం; చేనేత & వస్త్రాల శాఖా మంత్రి  S. సవిత  ఆధ్వర్యంలో నిర్వహించిన  సత్య సాయు జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ  పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు, ఈ సందర్బంగా చైర్ పర్సన్  వ్యవసాయం ( విత్తనాల పంపిణీ, ఎరువుల నిల్వలు మరియు ఇతర సమస్యలు), విద్య , గ్రామీణ త్రాగు నీటి సరఫరా శాఖలలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సత్వరమే సమస్యలను పరిష్కరించాలసిందిగా ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వ పార్లమెంట్ సభ్యులు, పలువురు శాసన సభ సభ్యులు,  సత్య సాయి జిల్లా కలెక్టరు, యస్.పి, జాయింట్ కలెక్టర్, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:Joint Anantapur District Praja Parishad Chair Person Visit

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *