ఉల్లి రైతును పరామర్శించిన రాఘవులు

Onions of the onion farmer visited

Onions of the onion farmer visited

Date:20/10/2018
కర్నూలు ముచ్చట్లు:
ఉల్లి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. శనివారం  కర్నూలు వ్యవసాయమార్కెట్లో  అయన   పర్యటించి ఉల్లి వేళలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లి కి  గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యాపారుల పైనే ఆధార పడకుండా ప్రభుత్వం  కనీసం ఒక కింటాల్ కు 1500 రూపాయల చొప్పున ధర నిర్ణయించాలని డిమాండ్ చేసారు. తక్కువ ధరకు అమ్ముకున్న రైతుకు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వము జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  కరువు కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. రైతులు బాగా నష్టపోతున్నారు.   రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వమే ఉల్లి  కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల ధరలు పెరిగాయి ఎకరాకు 40 వేల నుండి 50 వేల దాకా ఖర్చు అవుతున్నాయి.  పంట చేతికొచ్చిన పెట్టిన ఖర్చులు కూడా వెళ్లడం లేదని  లద్దగిరి ,సుంకేసుల ,పంపాడు రైతులు రాఘవులురి దృష్టికి తెచ్చారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె .ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీ .షడ్రక్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ, ఈ. పుల్లారెడ్డి ఇతర నేతలు పాల్గోన్నారు.
Tags: Onions of the onion farmer visited

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *