ఏకాంతంగా శ్రీ సీతారాముల కల్యాణం

Date:22/04/2021

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీ‌ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా క‌ల్యాణం నిర్వ‌హించారు.సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ఆల‌య అర్చ‌కులు శ్రీ ఆనంద దీక్షితులు ఆధ్వర్యంలో కల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్  రమేష్ రెడ్డి,ఎస్ ఈ  జగదీశ్వర్ రెడ్డి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  పార్వ‌తి, ఏఈవో  దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌  రమేష్‌, ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags: Welfare of Sri Sitaram in solitude

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *