ఏపీలో సర్పంచ్ లకు శుభవార్త

Date:04/05/2021

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో సర్పంచ్‌లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా సర్పంచ్‌లుగా గెలిచిన వారందరికీ చెక్‌ పవర్‌ను బదలాయించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌ల వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)లో నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. వారంలోగా సర్పంచ్‌లందరికీ చెక్‌ పవర్‌ కల్పిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ చెప్పారు.సీఎఫ్‌ఎంఎస్‌లో వివరాల నమోదుకు ఆర్థిక శాఖ అవకాశం కల్పించిన వెంటనే సర్పంచ్‌ల గెలుపు ధ్రువీకరణ పత్రాలు, వారి ఇతర వివరాలు, డిజిటల్‌ సిగ్నేచర్‌ను అన్ని సబ్‌ ట్రెజరీ ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ వివరాల నమోదు పూర్తయ్యాక జిల్లా ట్రెజరీ అధికారులు ఆమోదముద్ర వేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిర్వహించలేదు.. 2018 నుంచి మొన్న పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. వారికే చెక్‌ పవర్‌ అధికారం ఉంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచ్‌లు ఏప్రిల్‌ 3న పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారికి చెక్‌ పవర్‌ను బదలాయించే ప్రక్రియను మొదలు పెట్టారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Good news for sarpanches in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *