ఐపీఎల్ నిరవధిక వాయిదా

Date:04/05/2021

ముంబై     ముచ్చట్లు:

ఐపీఎల్ 2021 సీజన్‌ నిరవధికంగా వాయిదాపడింది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారినపడగా.. గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకీ కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌ కొనసాగడం కష్టమని ఓ నిర్ధారణకి వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికంగా మంగళవారం ఓ ప్రకటనని విడుదల చేశాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. 14 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇలా సీజన్ మధ్యలో టోర్నీని నిలిపివేయడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే క్రికెటర్లు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్, టీమ్ కోచింగ్ స్టాఫ్స్, కామెంటేటర్లు, మ్యాచ్ అధికారులు, ట్రావెల్ సిబ్బందిని ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంచి.. మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షల తర్వాత బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చారు. ఒక్కసారి ఈ బబుల్‌లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బబుల్‌లో లేని వ్యక్తితో పర్సనల్‌గా కాంటాక్ట్ అవడానికి అనుమతించరు. ఈ నిబంధనని కఠినంగా అమలు చేయడంతో.. ముంబయి, చెన్నైలోమ్యాచ్‌ల్ని నిర్వహించినా.. బబుల్‌లోని ఎవరూ కరోనా వైరస్ బారినపడలేదు. కానీ.. గంటల వ్యవధిలోనే వరుసగా టీమ్‌లలో కరోనా కేసులు నమోదవడంతో.. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందు టోర్నీని వాయిదా వేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకపోయింది.ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమవగా.. మే 2 వరకూ 29 మ్యాచ్‌లను బీసీసీఐ దిగ్విజయంగా నిర్వహించగలిగింది. కానీ.. కోల్‌కతా టీమ్‌లో సోమవారం కరోనా కేసులు నమోదవడంతో.. బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌ని బీసీసీఐ వాయిదా వేసింది. ఇక ఈరోజు రాత్రి ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. హైదరాబాద్ కీపర్ సాహాకి పాజిటివ్‌గా తేలడంతో.. మ్యాచ్‌ని వాయిదాతో సరిపెట్టాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ.. నిమిషాల్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ స్నిన్నర్ అమిత్ మిశ్రాకి కూడా పాజిటివ్‌గా తేలడంతో.. ఇక టోర్నీని కొనసాగించడం కష్టమని బీసీసీఐ తేల్చేసింది.
ప్రపంచకప్  పై ప్రభావం
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నా కూడా బీసీసీఐ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ఐపీఎల్‌ను ప్రారంభించింది. క‌ఠిన‌మైన బ‌యో బ‌బుల్‌లో ప్లేయ‌ర్స్‌ను ఉంచి, ప్రేక్ష‌కుల‌ను మైదానాల‌కు రాకుండా చేసి మ్యాచ్‌లు నిర్వ‌హించారు. కానీ నెల రోజులు కూడా కాకుండానే వాయిదా వేయాల్సి వ‌చ్చింది. బ‌బుల్‌ను ఛేదించుకొని క‌రోనా ప్లేయ‌ర్స్‌కి సోక‌డంతో చేసేది లేక వాయిదా వేసింది. దీని వ‌ల్ల ఇప్పుడు అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌ల‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌పై కూడా నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. నిజానికి దేశంలో కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంతో ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ప్ర‌త్యామ్నాయ వేదిక‌గా యూఏఈని ఎంచుకుంద‌న్న వార్త‌లు చాలా రోజుల కింద‌టే వ‌చ్చాయి.ఇక ఇప్పుడు ఐపీఎల్ వాయిదా ప‌డ‌టంతో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను యూఏఈకి త‌ర‌లించ‌డం దాదాపు ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ టోర్నీలో 16 టీమ్స్ పాల్గొంటాయి. అస‌లే అంత‌ర్జాతీయ టోర్నీ. ఏమాత్రం తేడా వ‌చ్చినా బీసీసీఐతోపాటు భార‌త ప్ర‌భుత్వ ప‌రువు కూడా పోతుంది. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయా టీమ్స్ కూడా ఇండియాకు రావాలంటే జంకుతున్నాయి. ఈ విష‌యాన్ని బీసీసీఐ కూడా చెప్పింది. ఈ నేప‌థ్యంలో టోర్నీని త‌ర‌లిస్తేనే బెట‌ర్ అన్న ఆలోచ‌న బోర్డు చేస్తోంది. ఈ మ‌ధ్యే బోర్డు పెద్ద‌లు ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్లు పీటీఐ వెల్ల‌డించింది.ప్ర‌స్తుతం ఇండియా ఎదుర్కొంటున్న సంక్షోభంలో ఆ మెగా టోర్నీని ఇక్క‌డి నుంచి త‌ర‌లిండ‌మే మంచిద‌న్న అభిప్రాయాన్ని బీసీసీఐ సీనియ‌ర్ అధికారి ఒక‌రు వ్య‌క్తం చేశారు. పైగా అక్టోబ‌ర్ స‌మ‌యంలోనే క‌రోనా మూడో వేవ్ కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో బీసీసీఐ ద‌గ్గ‌రే హోస్టింగ్ హ‌క్కుల‌ను పెట్టుకొని యూఏఈలో టోర్నీ నిర్వ‌హించ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ఆ అధికారి అన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Taags:IPL indefinite postponement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *