కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు-తహసీల్దార్ శ్యాంప్రసాద్ రెడ్డి

Date:03/05/2021

సోమల ముచ్చట్లు:

మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ శ్యాంప్రసాద్రెడ్డి సోమవారం వెల్లడించారు. ఆయన వివరాల మేరకు ఇరికిపెంట పంచాయతీ నడింపల్లె, నంజంపేట పంచాయతీ, 81 చిన్న పల్లె పంచాయతీలను కంటోన్మెంట్ ప్రకటించి బోర్డులను ఏర్పాటు చేశామని అన్నారు. ఆదివారం ఒక్కరోజే మండల వ్యాప్తంగా 40 కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. సోమవారం వీటికి తోడు మరో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మండల వ్యాప్తంగా సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేశామన్నారు. శానిటేషన్ వేగవంతం చేశామని, ప్రజలు మాత్రం అవసరమైతే తప్ప వీధులలోకి రాకూడదని పేర్కొన్నారు. అవసరమైతే కచ్చితంగా మాస్కు ధరించి రావాలని సూచించారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags; Establecimiento de zonas de acantonamiento – Tehsildar Shamprasad Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *