కరోనాతో రిలే దీక్షలు వాయిదా

Date:22/04/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

లంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించేందుకు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను వాయిదా వేస్తున్నట్లువైఎస్ షర్మిల ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.తెలంగాణలో కరోనా రెండో దశ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆమె కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగ సాధన పోరాటానికి కేవలం తాత్కాలిక వాయిదా మాత్రమే, అన్ని పరిస్థితులు సద్దుమణిగాక దీక్షలు ప్రారంభిస్తామన్నారు. గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:Postpone relay initiations with Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *