కరోనా మేళగా మారిన కుంభమేళ

Date:03/05/2021

డెహ్రాడూన్ ముచ్చట్లు:

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోంది. రోజూ 4లక్షలకు దగ్గరిగా కేసులు, 3వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత ఆందోళనపరిచేలా మధ్యప్రదేశ్‌ నుంచి ఓ సంచలన రిపోర్టు బయటికి వచ్చింది. ఇటీవల హరిద్వార్‌లో నిర్వహించిన కుంభమేళాకు హాజరైన తమ రాష్ట్రానికి చెందిన వారిలో 99శాతం మందికి కరోనా సోకినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. కుంభమేళాకు వెళ్లొచ్చిన 61 మందిని గుర్తించిన అధికారులు వారికి టెస్టులు చేయగా 60 మందికికరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.దీంతో వీరందరిని హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కుంభమేళాలో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చిన మరికొందరిని ఇంకా గుర్తించకపోవడంతో వారి ద్వారా వైరస్ ఎంతమందికి వ్యాపిస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటైన కుంభమేళా నుంచి తిరిగివచ్చిన యాత్రికులు 14 రోజులు విధిగా క్వారంటైన్‌లో ఉండాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కుంభమేళా నుంచి వచ్చిన వారు కచ్చితంగా 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కుంభమేళా జరిగిన రోజుల్లోనే వేయి మందికి తగ్గకుండా రోజూ కేసులు నమోదయ్యేవి. అయితే అక్కడి సామూహిక వ్యాప్తి ద్వారా వైరస్ అంతగా సోకే ప్రమాదం లేదని అధికారులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారిలో చాలామంది స్వస్థలాలకు వెళ్లిన తర్వాత కరోనా సోకడం కలవరపరుస్తోంది.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Aquarius that became the Corona Fair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *