కాకాణి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Date:04/05/2021

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీనిపటిష్టంగా అమలు చేయడంతో పాటు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎన్నడూ లేని విధంగా ఉదారంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు అని ఆయన సేవలను  కొనియాడారు.తెలుగుదేశం ప్రభుత్వంలో పక్షపాత వైఖరితో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందే ఆర్థిక సహాయాన్ని తెలుగుదేశం పార్టీ వారికే పరిమితం చేస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రిసహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నాం అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ శాసన సభ్యునిగా ఎవ్వరు వచ్చినా, కాదనకుండా సుమారు 2కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారాఇవ్వడం జరిగిందన్నారు.రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా  ప్రజలకు అవసరమైన వైద్యం, మందులు అందించడంతో పాటు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కరోనాను నియంత్రించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నారు అనిఅన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్న సమయంలో సూచనలు, సలహాలు అందించాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడం హేయమైన చర్య అన్నారు . తెలుగుదేశంప్రభుత్వంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు, 108,104 వైద్యసేవలకు పునరుజ్జీవం ప్రసాదించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తుచేసుకున్న అర్హులైన వారందరికీ త్వరలోనే ఆర్థిక సహాయాన్ని అందించడానికి కృషి చేస్తానన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Distribution of Chief Minister’s Assistance Fund checks over Kakani’s hands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *