కె తిమ్మాపురం సర్పంచ్ బిజీ లక్ష్మిదేవమ్మ ఇక లేరు

Date:04/05/2021

అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన లక్షిదేవమ్మ
సంతాపం తెలిపిన  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురం గ్రామ సర్పంచ్( సిపిఐ)  బిజీ లక్ష్మి దేవమ్మ( 70) అనారోగ్యంతో కన్నమూశారు. మంగళవారం మధ్యాహ్నం  ఎమ్మిగనూరు పట్టణం గీత మందిర్ సమీపంలో ని ఓ ప్రవేట్ క్లినిక్ లో వైద్యం చుపించుకున్నారు.అక్కడ వైద్యులు లక్ష్మి దేవమ్మ ను పరీక్షించి పల్స్ రేట్  తక్కువగా ఉందని కర్నూలు కు వెళ్ళాలని సూచిన్చారు. కర్నూలు కు వెళ్ళాలని కుటుంబ సభ్యులు మాట్లాడుతుండగా ఉన్నట్టుండి సర్పంచ్ బిజీ లక్ష్మిదేవమ్మ కుప్పకూలి పోయింది. కొద్దిసేపటికి తుది శ్వాస విడిచారు. లక్ష్మిదేవమ్మ కు గత మూడు రోజులుగా స్పల్ప జ్యారం తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతక ముందు లక్ష్మీదేవమ్మ బిపి తో పాటు కాళ్ళ నొప్పులతో బాధపడేవారు. సిపిఐ పార్టీ లో జిల్లా రాష్ట్ర స్థాయినాయకులుగా రాణించి 30 సంత్సరాలు కే తిమ్మాపురం గ్రామ సర్పంచ్ గా బిజీ మాదన్న సేవలు అందించి ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజక వర్గాల లో మంచి రాజకీయ నాయకులు గా పేరు తెచ్చుకున్నారు. బిజీ మాదన్న అడుగుజాడలలోఆయన సతీమణి లక్ష్మిదేవమ్మ రెండు సార్లు సర్పంచ్ గా ఒక సారి ఎంపీటిసి గా సిపిఐ పార్టీ తరఫున గెలిపొంది ప్రజలకు సేవలు అందించి గ్రామ అబివృద్ది కు పాటుపడ్డారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గా లక్ష్మి దేవమ్మ  గెలుపొందడం జరిగింది. బిజీ మాదన్న ఇతని భార్య బిజీ  లక్ష్మిదేవమ్మ లు దాదాపు 40 ఏళ్ళ పాటు సర్పంచ్  గా ఎంపిటిసి గా గెలుపొంది ప్రజలకు మెరుగైన సేవలు అందించి  అభిమానాన్ని చూరగొన్నారు. లక్ష్మిదేవమ్మ   ప్రజలకుచేయాలనుకున్న అభివృద్ధి  పనులు కోరిక తీరక ముందే కన్ను మూయడం కే తిమ్మాపురం గ్రామ ప్రజలను కుటుంబ సభ్యులు ను కంట తడి పెట్టిస్తుంది. లక్ష్మిదేవమ్మ కు ఇద్దరు కుమారులు ఇక కుమార్తె ఉండగా పెద్ద కుమారుడు చాల ఏళ్ళ క్రితంమరణించారు. చిన్న కుమారుడు బిజీ విరూపాక్ష నాయడు సిపిఐ నాయకులు గా ఉన్నారు.కుమార్తె ను స్వగ్రామంలో ఇచ్చి వివాహం చేశారు. బిజీ మాదన్న 3 ఏళ్ల క్రితం గుండెపోటు తో మరణంచాడు. మనవడు సురేంద్ర నాయుడు 4ఏళ్ళ క్రితంవిద్యుత్ షాక్ కు గురి అయ్యి మరణించాడు. ముగ్గురు మనవులు వెంకటేష్ హేమంత్ అశోక్ లు ఉన్నారు. లక్ష్మీదేవమ్మ మృత దేహానికి ఈ నెల 6 వ తేదీ కే తిమ్మాపురం లో అంత్యక్రియలు నిర్వహించునున్నారు. లక్ష్మీ దేవమ్మ మృతి పట్ల సిపిఐరాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ  ఎమ్మిగనూరు శాసన సభ్యులు కే  చెన్నకేశవ రెడ్డి వైకాపా నేతలు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి వై రుద్ర గౌడ్ మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మంత్రాలయం టిడిపి ఇంచార్జి పి తిక్కా రెడ్డి బిజెపిఇంచార్జి మురారి రెడ్డి  బిజేపి మంత్రాలయం కన్వీనర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది బి పురుషోత్తమ రెడ్డి సీపీఐ రాష్ట్ర జిల్లా నాయకులు రామచంద్రయ్య రామాంజేయులు గిడ్డయ్య జగన్నాథం భీమలింగప్ప రసూల్  అజయ్ బాబు మునెప్ప లెనిన్ఏఐఏస్ఏఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న ఎమ్మిగనూరు సిపిఐ నాయకులు పంపన్న గౌడ్ భాగ్య లక్ష్మి భాస్కర్ సత్యన్న చిన్నన్న సీపీఎం నాయకులు హనుమంతు అంబేత్కర్  ప్రగాఢ సంతాపం తెలిపారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:K Thimmapuram Sarpanch Busy Lakshmidevamma is no more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *