కేవీ అడ్మిషన్లు వాయిదా

Date:22/04/2021

హైదరాబాద్   ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీబీఎస్ఈ బోర్డు పది పరీక్షలను రద్దు చేశారు. 12వ తరగతి, యూజీసీ నెట్, జేఈఈ మెయిన్స్‌ తదితర పరీక్షలను వాయిదా వేశారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన మొదటి జాబితా విడుదల ప్రక్రియ కూడా వాయిదా పడింది.వాస్తవానికి కేంద్రీయ విద్యాలయ షెడ్యూల్‌ ప్రకారం.. మొదటి జాబితాను ఏప్రిల్‌ 23న విడుదల చేయాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలల్లో కేసులు పెరగుతున్నాయి. దీంతో కేంద్రీయ విద్యాలయ సమితి మొదటి జాబితా విడుదలను వాయిదావేసినట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) ప్రకటించింది.
ఈ జాబితాను ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని అధికారిక వెబ్‌సైట్‌ https://kvsonlineadmission.kvs.gov.in/ లో ప్రకటిస్తామని కేవీఎస్ వెల్లడించింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 19న ముగిసింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం మొదటి జాబితాను ఏప్రిల్‌ 23న విడుదల చేసిన తర్వాత.. ఏప్రిల్‌ 30న రెండు, మూడోజాబితాను విడుదల చేస్తామని కేవీఎస్ ప్రకటించింది. అప్పటికీ సీట్లు మిగిలి ఉంటే.. మే 5న అడ్మిషన్‌ ప్రక్రియను చేపడతామని కేవీఎస్ అధికారులు ప్రకటించారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:KV Admissions Postponed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *