కొడుకు సినిమా కోసం బాహుబలి సెట్టింగ్స్

 Date:06/12/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
బాహుబలి-2’ తో భారతీయ సినీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. విడుదలైన అన్నిచోట్లా ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మరే భారతీయ చిత్రానికి రానన్ని అవార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇక రాజమౌళికి దక్కిన ప్రశంసల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిత్రానికి ఆయన ఎంత కష్టపడ్డారో తెలియంది కాదు. కానీ ఈ సినిమాకు రాజమౌళి కంటే ఎక్కువగా కష్టపడిన వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే రాజమౌళి తనయుడు కార్తికేయ. ఈ విషయాన్ని రాజమౌళి ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక విషయానికొస్తే.. కార్తికేయ ఈ నెలలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన చిన్ననాటి ప్రేయసి పూజా ప్రసాద్‌ను ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. పూజా.. ప్రముఖ నటుడు జగపతిబాబు బంధువైన రామ్ ప్రసాద్ కుమార్తె. కార్తికేయ, పూజాల వివాహం ఈ నెల 30న పింక్ సిటీ ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. 250 ఎకరాల్లో బాహుబలి తరహా సెట్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లికి టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో అతిథుల కోసం సెవన్ స్టార్ హోటల్‌ను బుక్ చేశారంట. సినిమా అయినా, నిజ జీవితమైనా తన ఆలోచనలు భారీగానే ఉంటాయని రాజమౌళి మరోసారి నిరూపిస్తున్నారు. బాహుబలి స్టైల్‌లో భారీస్థాయిలో జరగనున్న ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. దీంతో దర్శకధీరుడు తన కుమారుడి పెళ్లితో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
Tags:Bahubali Settings for Son Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *