కోవిడ్‌ వ్యాక్సిన్‌ పై అపోహలొద్దు

Date:22/04/2021

చౌడేపల్లె ముచ్చట్లు:

కోవిడ్‌ నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి వేస్తున్న వ్యాక్సిన్‌ పట్ల ఎలాంటి అపోహలొద్దంటూ ఎంపీడీఓ వెంకటరత్నం సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ, ఎంఆర్సి కార్యాలయాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్దుమెంబర్లకు జూమ్‌ మీటింగ్‌ ద్వారా అవగాహన కల్పించారు. ప్రస్తుతం సెకెండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని వివరించారు.ప్రజలకు కోవిడ్‌ పట్ల ఉన్న అనుమానాలు తీర్చి, మాస్క్లు ధరించడం, శానిటేజర్‌ వాడడంవలన కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని సూచించారు. మే 1నుంచి 18 సంవత్సరాలనుంచి పైబడిన వారందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్‌ వేస్తుందని తెలిపారు. నిర్ణీత గడువులోపు వెహోదటి వ్యాక్సిన్‌ వేసుకొన్న వారందరూ రెండవ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డీ మహమ్మద్‌ ఆజాద్‌ తదితరులున్నారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags: Misconceptions about the Kovid vaccine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *