కోవిడ్ పై ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్దేశించిన ధరలకే కోవిడ్ ట్రీట్ మెంట్

Date:22/04/2021

అమరావతి   ముచ్చట్లు:

గురువారం నాడు జరిగిన కోవిడ్ పై  మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. వైద్య ఆరోగ్య శాఖామంత్రి, ఆళ్ళ కాళీకృష్ణ నాని మాట్లాడుతూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతోంది. సీఎం జగన్ ప్రతీరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ ప్రబలకుండా ఉండేందుకు చర్యలు చర్చించాం. బెడ్లు, ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత చర్చ జరిగింది. 104 కాల్ సెంటర్ ని మరింతగా బలోపేతం చేస్తున్నాం. రేపు సీఎం జగన్ దృష్టికి ఈరోజు జరిగిన భేటీ లో వచ్చిన సూచనలు తీసుకెళతాం. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కోవిడ్ ట్రీట్మెంట్ చేయాలి. అటువంటి పరిస్ధితి వస్తే చాలా కఠినమైన చర్యలుంటాయి.  అందరూ కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. కోవిడ్ ను ఎదుర్కోవాలంటే ప్రజలందరూ కలిసి రావాలి. కోవిడ్ రహిత రాష్ట్రంగా ఏపీ ని తీర్చిదిద్దడంలో అందరూ సహకరించాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైనంత వరకూ తగినంత ఆక్సిజన్ ఉంది. ప్రతీరోజు అవసరం అయిన 360 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. కేంద్రం నుంచీ కూడా ఆక్సిజన్ పంపే పరిస్ధితి ఉంది. 49 లక్షల మందికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేసాం. ఫ్రీ వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ తో ఆలోచించి నిర్ణయిస్తాం. టెస్టుల రిజల్టులు లేటు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించామనిఅన్నారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:Kovid treatment at the prices set by the cabinet subcommittee meeting that ended on Kovid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *