కోవిడ్ మందుల కేసులో నలుగురు ఆరెస్టు

Date:22/04/2021

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో రెమ్డెసివర్ ఇంజక్షన్లు బ్లాక్లో విక్రయించిన నలుగురిని పోలీసులు పోలీసులు అరెస్టు చేశారు. ఓమ్ని ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ మేనేజర్గా పనిచేస్తున్న సర్వేశ్వరరావు గత నెల 31న కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఇండెంట్ పెట్టి కొన్ని రెమ్డెసివర్ ఇంజిక్షన్లు తెప్పించుకు న్నాడు. అందులో మూడు ఇంజక్షన్లను  5400 చొప్పున తన స్నేహితుడు రమేష్కు విక్రయించాడు. తరువాత తన కింది ఉద్యోగి వెంకటరావును నాలుగు ఇంజక్షన్లు సమకూర్చమని కోరాడు. దీంతో అతను ఓమ్ని ఆసుపత్రి కొవిడ్ వార్డులో ఎవరూ లేని సమయంలో రెండు ఇంజక్షన్లు చోరీచేసి ఇచ్చాడు. స్టాఫ్ నర్సులైన సింధుజ, దివ్య కృపల నుంచి మరో రెండు ఇంజిక్షన్లు సేకరించాడు. మొత్తం ఈ నాలుగు ఇంజిక్షన్లు ఒక్కొక్కటి 7 వేల చొప్పున వాసు అనే వ్యక్తికి 28 వేలకు విక్రయించారు. విజిలెన్స్ అధికారులకు పట్టుబడటంతో ఆసుపత్రి యాజమా న్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సి.ఐ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై ధర్మేందర్ కేసు నమోదు చేసి నాలం సర్వేశ్వరరావు , ఇనపసప్పల వెంకటరావు, స్టాఫ్నర్స్లు సింధుజ , గోరివతి దివ్యకృప లను అరెస్టుచేసి రిమాండుకు తరలించామని ఏసీపీ హర్షిత తెలిపారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:Four arrested in Kovid drug case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *