గర్భవతిని బెయిల్ ఇవ్వండి

Date:22/04/2021

ముంబై ముచ్చట్లు:

అత్తని చంపిన కేసులో జైలుకెళ్లిన కోడలికి కోర్టు ఊహించని షాకిచ్చింది. గర్భవతినన్న సాకుతో బయటికి వచ్చేందుకు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆమెను జైలు నుంచి బయటికి పంపేందుకు కోర్టు సమ్మతించలేదు. కసాయి కోడలికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు..మీర్జాపూర్‌కి చెందిన నిఖిత అలియాస్ నయ్‌రా అగర్వాల్(29) అత్తను మర్డర్ కేసులో గతేడాది అక్టోబర్‌లో అరెస్టై జైలుకెళ్లింది. రెండు నెలల కిందట ఆమె బెయిల్ కోసం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆమెకు బెయిలిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది అగర్వాల్.గర్భవతినని.. ప్రస్తుతం ఏడో నెల గర్భంతో ఉన్నానని పిటిషన్‌లో పేర్కొంది. మెడికల్ చెకప్, విశ్రాంతి కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరింది. ఆమె పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఊహించని షాకిచ్చింది. కేవలం గర్భవతి అనే కారణంతో బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారం జైలు అధికారులు ఆమెకు మెడికల్ చెకప్, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.గర్భిణిగా పేర్కొన్న అగర్వాల్ ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని.. అందువల్ల బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. నిందితురాలు అగర్వాల్ తన అత్త రేఖాబెన్ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అత్తమామలతో మంచి సంబంధాలు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుందని.. అయితే గౌరవంపైనే ఆ విషయం ఆధారపడి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:Bail the pregnant woman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *