గర్భిణీలకు గాంధీ అండ

Date:03/05/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

కొవిడ్ సోకిన గర్భిణీ లకు గాంధీ హాస్పిటల్ కొండంత అండగా మారింది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో వైరస్ సోకినా సదరు గర్భిణీలు గాంధీకి పరుగులు పెడుతున్నారు. ఇది పూర్తిస్థాయిలో నోడల్ కేంద్రంగా మారడంతో వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైరిస్క్(గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు) కేటగిరికి చెందిన వారికి స్పెషల్ వార్డులు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ వార్డులను మిగతా కొవిడ్ పేషెంట్లకు దూరంగా వేరే బ్లాక్‌లలో ఏర్పాటు చేశారు. ఓపి కౌంటర్లను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేశారు. పాజిటివ్ తేలిన గర్భిణీ అడ్మిట్ కాగానే మొదట ఆమె ఆరోగ్య పరిస్థితిని వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు డాక్టర్ల బృందం పరీక్షించి కేస్ షీట్‌ను తయారు చేస్తున్నారు.బిపి, ఫల్స్ రేట్, బరువు వంటివి చూసి నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత సదరు గర్భిణీ ఏ నెలలో ఉంది? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డెలివరీకి ఎన్ని రోజుల సమయం ఉంది? ఇతర ఆరోగ్య సమస్యలు ఎమైనా ఉన్నాయా? క్రిటికల్ కండీషన్ అయ్యే అవకాశం ఉందా? అనే అంశాలను గైనకాలజీ బృందం క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది. అనంతరం స్పెషల్ వార్డుకు తరలించి 14 రోజుల పాటు కోవిడ్ చికిత్సను అందిస్తున్నారు.ఆ తర్వాత మరోసారి ఆర్‌టిపిసిఆర్ టెస్టును చేసి నెగటివ్ వస్తేనే ఇళ్లకు పంపతున్నారు. పాజిటివ్ వస్తే మరో వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఈక్రమంలో యోగా, ఇతర చిన్నపాటి శరీర వ్యాయమాలు కూడా చేపిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.మరోవైపు చికిత్స సమయంలో ప్రతి రోజు పౌష్ఠికాహారంతో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రతి రోజు ప్రత్యేకమైన డైట్‌ను ఇస్తున్నామని గైనకాలజీ విభాగం వైద్యులు తెలిపారు. దీంతోపాటు అవసరమైన వారికి డెలివరీలు కూడా చేస్తున్నారు. డిశ్చార్జ్ సమయంలో తల్లి, బిడ్డకు ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేసి నెగటివ్ తేలితే ఇళ్లకు పంపుతున్నారు. అయితే ఈ కరోనా గర్భిణీ స్త్రీల వార్డులో ప్రతి షిప్టుకు అన్ని విభాగాల ప్రోఫెసర్లు, అసిస్టెంట్ ప్రోఫెసర్లు, వైద్యులు, పిజీలు, నర్సులు, ఇతర సహయకులు కలిపి సుమారు 50 పనిచేస్తున్నారని గాంధీ సూపరింటెండెంట్ ప్రోడా రాజరావు పేర్కొన్నారు. మూడు షిష్టులలో వైద్య సేవలందిస్తూ మతా శిశువులను రక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Gandhi egg for pregnant women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *