గుట్రాజ్‌పల్లెలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ

The discovery of Telangana mother statue in Gudrajpur

The discovery of Telangana mother statue in Gudrajpur

Date:14/06/2018
జగిత్యాల ముచ్చట్లు :
జగిత్యాల మండలం గుట్రాజ్‌పల్లెలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత గురువారం ఆవిష్కరించారు. అనంతరం రూ. 32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాల భవనాలకు ఎంపీ కవిత భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జగిత్యాల నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇంచార్జీ డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, జడ్పీటీసీ నాగలక్ష్మి, ఎఎంసీ చైర్‌పర్సన్ శీలం ప్రియాంక, గుట్రాజ్‌పల్లి సర్పంచ్ విజయలక్ష్మితో పాటు పలువురు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Tags:The discovery of Telangana mother statue in Gudrajpur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *