చంటిబాబు మెడకు సుబ్రహ్మణ్యం కేసు

కాకినాడ ముచ్చట్లు:

 

గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట.చంటిబాబు జగ్గంపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఈ నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. ఆ సమయంలో జగ్గంపేట టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న చంటిబాబును వైసీపీలోకి తీసుకురావడంలో అనంతబాబు ఫుల్‌ సపోర్ట్‌ చేశారట. తర్వాత జరిగిన ఎన్నికల్లో చంటిబాబుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం.. ఆయన ఎమ్మెల్యే కావడం చకచకా జరిగిపోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఉంది. చంటిబాబు.. నెహ్రూ.. అనంతబాబు ముగ్గురూ బంధువులే. నాడు రాజకీయంగా సపోర్ట్ చేయడం.. బంధువు కావడంతో అనంతబాబు కేసులో ఇరుక్కున్నప్పుడు చంటిబాబు యాక్టివ్‌ రోల్‌ పోషించినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అదేదో చిన్న కేసు అనుకుని తనస్థాయిలో చక్కబెట్టేద్దామని ఎమ్మెల్యే అభిప్రాయపడినట్టు టాక్‌. కానీ.. చివరకు చిరిగి చేట అవ్వడంతో కక్కలేక మింగలేక ఉన్నారట చంటిబాబు.కేసులో నుంచి ఎలా బయటకు రావొచ్చు.. అనపర్తి స్పెషల్‌ బ్రాంచిలో పనిచేస్తున్న ఒక అధికారిని మధ్యలో ఉంచి మొత్తం క్లియర్‌ చేస్తానని అనంతబాబుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

 

 

 

దానికి తగ్గట్టుగా జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడటానికి పిక్చర్‌ ప్రిపేర్‌ చేశారట. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లడంతో.. అనవసర విషయాల్లో తలదూర్చొద్దని ఎమ్మెల్యేకు ఆదేశాలు వెళ్లాయట. దాంతో ఆ హెల్పింగ్‌ ఎపిసోడ్‌కు అక్కడితో బ్రేక్‌ పడినట్టు తెలుస్తోంది. అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు పిన్‌ టు పిన్‌ అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. అందుకే అప్పట్లో జరిపిన ఫోన్‌ సంభాషణపై ఎమ్మెల్యే ఇప్పుడు బెంగ పెట్టుకున్నారట.హత్య కేసుతో సంబంధం లేకపోయినా.. ఆ సమయంలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్లే చేయకుండా ఉండాల్సింది అని ఇప్పుడు బాధపడుతున్నారట ఎమ్మెల్యే. మరీ అడ్వాన్స్‌ అయిపోయామా అని ఆంతరంగికుల చర్చల్లో ఆరా తీస్తున్నారట. పరిధికి మించి ప్రవర్తించామా అని ఒక్కోసారి ఉలిక్కి పడుతున్నారట. భవిష్యత్‌లో విచారణకు పిలవరు కాదా అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అసలే అక్షింతలు పడ్డాయి. ఇప్పుడు పిలిస్తే ఇంకా డ్యామేజ్‌ అవుతుందని టెన్షన్‌ పడుతున్నారట ఎమ్మెల్యే. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని.. దారినపోయే కంపను తగిలించుకున్నామని ఆవేదన చెందుతున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జిల్లా వైసీపీ వర్గాల్లో ఏమ్మా చంటి..! ఏంటి సంగతి అని సెటర్లూ వేస్తున్నారట.

 

 

Post Midle

Tags: Chantibabu neck Subrahmanyam case

Post Midle
Natyam ad