చిలుకూరులో నిరాడంబరంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

Date:22/04/2021

రంగారెడ్డి  ముచ్చట్లు:

చిలుకూరు బాలాజీ ఆలయంలో  నిరాడంబరంగా  బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.  కరోనా మహమ్మారి జనాలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో చిలుకూరు  వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం  ధ్వజారోహణంతో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి.  ధ్వజ పటానికి గరుత్మంతుల వారిని అలంకరించి….యాగశాలలో హోమాలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి గరుడమూర్తికి అభిషేకం చేసారు.  నైవేద్యము, మంగళ హారతి చేసి నలుదిక్కులా గరుడ ముద్దని నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని  అతి తక్కువ మంది సంతానం లేని ఆడవాళ్ళకి సంతానప్రాప్తికి ఇవ్వడం జరిగింది. ఇదే రీతిలో ఏకాంతంగా మిగిలిన రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:Brahmotsavas that started modestly in Chilukur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *