జానారెడ్డి ఓటమికి..అనేక కారణాలు

Date:03/05/2021

నల్గొండ ముచ్చట్లు:

నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఓటమి అంచున ఉన్నారు.  కాంగ్రెస్ లో సీనియర్ నేత జానారెడ్డి ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించు కోలేకపోతుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ తిరిగి కోలుకుంటుందని భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా జానారెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ కు తెలంగాణలో ఇక భవిష్యత్ లేదని చెప్పడానికి ఈ ఎన్నిక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జానారెడ్డి సయితం రెండోసారి తనను సాగర్ ప్రజలు తిరస్కరిస్తారని ఊహించలేదు.జానారెడ్డి అసలు పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. తన కుమారుడిని బరిలోకి దింపాలని భావించారు. కానీ పార్టీ హైకమాండ్ పట్టు బట్టి మరీ జానారెడ్డిని బరిలోకి దించింది. మూడు నెలలు ముందుగానే పార్టీ అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించింది. జానారెడ్డి ఇతర పార్టీల అభ్యర్థుల కంటే ప్రచారంలో మందున్నారు. దాదాపు అన్ని గ్రామాలను రెండుసార్లు పర్యటించారు. జానారెడ్డి తన గెలుపు ఖాయమని భావించారు.కానీ జానారెడ్డి ఏ రౌండ్ లోనూ ఆధిక్యత కనపర్చలేదు. పదో రౌండ్ తన సొంత ప్రాంతంలో మాత్రం వెయ్యిలోపే ఆధిక్యతను కనపర్చడం విశేషం. ఇక జానారెడ్డి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇవే తన చివరి ఎన్నికలని చెప్పారు. అదే జానారెడ్డి కొంపముంచిందంటున్నారు. జానారెడ్డిని గెలిపించినా తమ ప్రాంతం ఈ మూడేళ్లలో అభివృద్ధి చెందలేదని, ఆయన గెలిచినా మళ్ల ీ హైదరాబాద్ కే పరిమితమవుతారని ప్రజలు భావించినట్లుంది.జానారెడ్డి గెలుపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కు ఊపు వస్తుందని భావించిన నేతలకు నిరాశే ఎదురయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేశారు. పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికను కూడా వాయిదా వేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జానారెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కూడా నేతలు తమ ప్రచారంలో బాగానే విన్పించారు. అయినా ప్రజలు మాత్రం జానారెడ్డిని పట్టించుకోలేదు. మొత్తం మీద కాంగ్రెస్ ఇక తెలంగాణలో కోలుకోవడం కష్టమేనని చెప్పడానికి జానారెడ్డి ఓటమి ఉదాహరణగా చెప్పాలి.
నల్గొండ, మే 3, (న్యూస్ పల్స్)

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Many reasons for Janareddy’s defeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *