జీవీఎంసీ 84 వ వార్డులో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ

Date:04/05/2021

విశాఖపట్నం ముచ్చట్లు:

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజల ఆరోగ్య దృశ్య 84వ వార్డు పరిధిలో మంగళవారం ఉదయం కార్పొరేటర్ చిన్న తల్లి అభ్యర్థన మేరకు జీవీఎంసీ అధికారులు విలీన గ్రామాల కు హైడ్రోక్లోరినేషన్ ట్యాంకర్ల ద్వారా  పారిశుద్ధ్య సిబ్బంది తో పిచికారీ చేశారు. 84 వ వార్డు పరిధిలో గల కొప్పాక, కొత్తూరు, నరసింగరావు పేట, సిరసపల్లి, సాలాపు వాని పాలెం, గ్రామాల్లో శానిటేషన్ చేశారని  తెలుగుదేశం నాయకులు మాధoశెట్టి నీలబాబు తెలిపారు. ఈ సందర్భంగా నీల బాబు మాట్లాడుతూ వైరస్ తో బాధపడుతున్న రోగుల అందరూ పి హెచ్ సి సెంటర్ లో కోవిడ్  టెస్టులు 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు  చేయడానికి జీవీఎంసీ అధికారులు ఏర్పాటు చేశారని ఈ అవకాశాన్ని 80, 84 వార్డు పరిధిలో ఉన్న గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. వైరస్ తీవ్రస్థాయిలో ఐదో తేదీ నుండి 15వ తేదీ వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు వైద్యాధికారులు హెచ్చరికలు చేస్తున్నారని ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని మాస్కులు ధరించాలని శానిటైజర్ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వినియోగించుకోవాలని సమదూరం పాటిస్తూ తమ పనులు చేసుకోవాలని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని ప్రజలకు నీల బాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సిరసపల్లి సన్యాసిరావు, సాలాపు సత్యనారాయణ, విల్లూరి రామచంద్ర రావు , మిర్తిపాటి గోపాలరావు, బోయిన మురళి, వానపల్లి బాబూరావు, కసిరెడ్డి సత్యనారాయణ, షేక్ వల్లీ, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 6న డిపో ప్రారంభంపై కలెక్టర్‌ పరిశీలన

Tags: Rocíe una solución de hipoclorito en la sala 84 de GVMC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *