జోరుగా వరికోతలు

Date:03/05/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

గ్రామాల్లో వరికోతల పనులు జోరుగా సాగుతున్నాయి. పంట కోతలు జరుగుతున్న జిల్లాల్లో ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం నాణ్యతలో వ్యవసాయ శాఖ యంత్రాంగం సూచనలు ఇస్తూ ధాన్యం కొనుగోళ్ల దిశగా చర్యలు చేపడుతోంది. దీంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ యాసంగిలో రైతులు సాధారణ విస్తీర్ణం కంటే రికార్డు స్థాయిలో 227శాతం అధికంగా ,50.58లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిపంట సాగు చేశారు. పంటసాగు నమోదు రికార్డులను సమీక్షించిన ప్రభుత్వం పంట దిగుబడిపై ముందుగానే అంచనా వేసి ఆమేరకు ధాన్యం కొనుగోళు ప్రణాళికను అమలు చేస్తోంది.యాసంగి సీజన్ కింద రాష్ట్రంలో మొత్తం కోటి 32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేసిన ప్రభుత్వం అందులో స్థానిక అవసరాలు పోను మిగిలే 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్షంగా పెట్టుకుంది.భాగంగా తోలుత 6575ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే కొనుగోలు కేంద్రాలకోసం రైతులనుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 6798కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.

వివిధ జిల్లాల్లో వరికోతలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకూ 4,485ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల తొలివారం నుంచి ఇప్పటివరకూ 6.43లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్య విక్రయించిన రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో రికార్డు చేస్తున్నారు. ఇప్పటివరకూ మొత్తం 77వేల మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించారు. సుమారు 1,211కోట్లు విలువ మేరకు ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రపౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్లను సమీక్షిస్తున్నారు. కమీషనర్ అనిల్ కుమార్ పౌరసరఫరాల సంస్థ కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ జిల్లా స్థాయిల్లో అదనపు కలెక్టర్లకు , పౌరసరఫరాల యంత్రాంగానికి సూచనలు చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకుని తేమ17శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో రైతులకు సూచనలు ఇస్తున్నారు. ధాన్యంలో తాలు , తరుగు సమస్యలు రాకుండా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తప్పనిసరిగా ప్యాడీక్లీనర్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాల సంస్థకు అవసరమైన నిధులు సమకూర్చడంతో మరింత పారదర్శకంగా రైతులకు నగదు చెల్లింపులు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేస్తున్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Loud harvests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *