జ్యోతిది హత్యా…ఆత్మహత్య

-కనిపించకుండా పోయిన ప్రియుడు
Date:17/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తాండూరుకు చెందిన బ్యూటీషియన్ జ్యోతి, మైలారం సమీపంలో రైలు పట్టాలపక్కన విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ ఘటనలో జ్యోతి ప్రియుడు సందీప్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అతడు కనిపించకుండా పోయాడు. తాను జ్యోతికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని సోమవారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పిన సందీప్, ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. ఈ కేసులో తాము సందీప్‌నే అనుమానిస్తున్నామని, అతడే స్వయంగా మాకు ఫోన్ చేయడంతోనే అనుమానం వచ్చిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సందీప్ మొబైల్‌ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా అతడ్ని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. మూడు ఏళ్లుగా సందీప్, జ్యోతిలు ప్రేమించుకుంటున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఓ ప్రయివేట్ బ్యాంకులో పనిచేసే సందీప్‌తో జ్యోతి పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడు కూడా జ్యోతితో రైల్లో తాండూరుకు వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పలు అనుమానాలు తలెత్తగా, ఆమె పనిచేస్తోన్న లింగంపల్లిలోని ‘గ్రీన్ ట్రెండ్స్’ ఉద్యోగులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం రాత్రి పట్టాల పక్కన కొన ఊపరితో పడి ఉన్న తమ కుమార్తెను రైల్వే సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదని, దీంతో ఉదయానికి ఆమె ప్రాణాలు పోయాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంపైనా పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.తాండూరులో అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని బీజాపూర్ రైలులో బయలుదేరిన జ్యోతి ధారూర్ మండలం మైలారం వద్ద   రాత్రి రైలు నుంచి కిందపడిపోయింది. సోమవారం ఉదయం రైలు పట్టాల పక్కన యువతి పడి ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది కొన ఊపిరితో ఉన్న జ్యోతిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది.
Tags: Jyothi murder … suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *