టిక్కెట్స్ ఉంటే చాలు…ఆంక్షల సడలింపు

Date:22/04/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కొన్నిచోట్ల లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్నాయి. ఇక ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణతో పాటూ తమిళనాడు, కర్ణాటకలో కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే వారికి అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు.ఏపీ నుంచి వేలాది మంది నిత్యం హైదరాబాద్ వెళుతుంటారు. కర్ఫ్యూ టైమ్‌లో హైదరాబాద్ చేరుకుంటే ప్రయాణానికి సంబంధించిన టికెట్ చూపిస్తే ఇళ్లకు వెళ్లనిస్తామని పోలీసులు చెబుతున్నారు. వారని పికప్ చేసుకునేందుకు వెళ్లే వారు సైతం తమ బంధువులు, స్నేహితుల ప్రయాణానికి సంబంధించిన టికెట్స్ చూపిస్తే చాలు. ఒకవేళ ఎవరైనా హెల్త్ ఎమర్జెన్సీతో సొంతవాహనాల్లో హైదరాబాద్ చేరుకుంటే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూపిస్తే సరిపోతుంది. ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి.మరోవైపు బెంగళూరు, చెన్నైకు బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులకు మినహాయింపు ఉంది. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల ఆ సమయంలో బస్సులను నడపకూడదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించడంతో విజయవాడ నుంచి రోజూ రాత్రి బయల్దేరే అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో సందిగ్ధం ఏర్పడింది. ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించింది. అంతర్రాష్ట్ర బస్సుల విషయంలో ఆంక్షలు విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దీంతో విజయవాడ నుంచి తెలంగాణ, బెంగళూరు, చెన్నైకు రాకపోకలు సాగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండాపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక సొంత వాహనాల్లో వెళ్లేవారు ఈ పాస్ ఉంటే చాలు

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags:If tickets are enough … relaxation of restrictions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *