టీఆర్ఎస్  వలలో బీజేపీ చిక్కుకుందా?

Date:22/04/2021

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలపడడంతో ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని భావించారు. అయితే కొద్ది రోజులుగా కొందరు నాయకుల ప్రవర్తనతో పార్టీ దిగజారుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా రూలింగ్ టీఆర్ఎస్ పార్టీ వేసిన వ్యూహాత్మక ఉచ్చులో బీజేపీ పడిందని దీంతో పార్టీ మరోసారి నష్టాలపాలైందని అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలను చేజార్చుకున్న బీజేపీకి తాజాగా టీఆర్ఎస్ పన్నిన వలతో ఆ పార్టీనాయకులు సతమతమవుతున్నారు.తాజాగా హైదరాబాద్ లోని లింగోజీగూడ బీజేపీ కార్పొరేటర్ రమేశ్ గౌడ్ అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీగా బరిలో దింపుతారని అందరూ భావించారు. అయితే వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అధిష్టానం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరుపున అభ్యర్థిని బరిలో దింపమని ప్రకటించింది. ముందుగా అందరూ షాక్ కు గురయ్యారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి బరిలో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక ఇక్కడ పెద్ద మ్యాజిక్ ఉందన్న విషయం బీజేపీ గ్రహించలేకపోయింది. లింగోజీగూడలో టీఆర్ఎస్ తప్పుకుంటే కాంగ్రెస్ నుంచి బరిలో అభ్యర్థి ఉంటాడు. దీంతో టీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి వైపు వేస్తారు. దీంతో ఆ అభ్యర్థి గెలిచాక టీఆర్ఎస్ కండువా కప్పుకునేలా టీఆర్ఎస్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ క్యాండెట్ నిలబెట్టకపోవడంతో ఓ వైపు సింపతితో పాటు మరోవైపు పరోక్షంగా తమ ఖాతాలో సీటు పడుతుంది. దీంతో బీజేపీకి మైనస్ అవుతుంది. ఇలా టీఆర్ఎస్ వేసిన వలలో బీజేపీ చిక్కుకుందని జీహెచ్ఎంసీలో అందరూ చర్చించుకుంటున్నారు.గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన బీజేపీ ఇక్కడ సీటు కోసం ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తోంది. మంత్రి కేటీఆర్ ను కలిసి ‘ప్రమాణం చేయకుండా బీజేపీ కార్పొరేటర్ మరణించాడని.. ఈ సీటులో పోటీపెట్టవద్దని ’ బీజేపీ సీనియర్ నేత రాంచంద్రరావు స్వయంగా వచ్చి కేటీఆర్ ను కలిశారు. బాధిత కుటుంబాన్ని వచ్చి కేసీఆర్ ను వేడుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ తరుపున అభ్యర్థిని నిలుపడం లేదని కేటీఆర్ ప్రకటించారు. ఈ పరిణామంతో కొందరు బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ ను కలిసి థ్యాంక్స్ చెప్పారు.అయితే బద్దశత్రుత్వం ఉన్న టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఈ కలయిక ఎలా ఉన్నా బయట మాత్రం టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న భావన ఫోకస్ అయినట్టు అయ్యింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా ప్రతీసారి కేసీఆర్ కటుుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే కొందరు బీజేపీ నాయకులు ఏకంగా కేటీఆర్ ను కలిసి ఇలా చేయడంపై పార్టీలోనే కాకుండా ప్రజల్లోనూ పార్టీ  పరువు పోయినట్లైంది.

పుంగనూరు ప్రజల సమ్యలపై తక్షణం స్పందించాలి-ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Tags: టీఆర్ఎస్  వలలో బీజేపీ చిక్కుకుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *