టీడీపీలో సంస్థాగత మార్పులపై లోకేష్ మార్క్

Date:20/02/2018
నెల్లూరు ముచ్చట్లు:
వచ్చే ఎన్నిలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జ్‌ల దూకుడుకు ఏకపక్ష పోకడకు ప్రత్యక్షంగానే చెక్ పెట్టబోతోంది. అది కూడా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న వేళ లోకేష్ మార్క్ కనపడే విధంగా ప్రయత్నిస్తున్నారు. మహానాడు జరిగే ప్రతిసారి ముందస్తు సంస్థాగత ఎన్నికలను పార్టీ నిర్వహిస్తూ వచ్చింది. ఈ సాంప్రదాయం పార్టీ ఆవిర్భావం నుంచి ఉంది. అప్పటికి, ఈసారి జరగబోయే సంస్థాగత ఎన్నికలకు పెద్ద మార్పులు, చేర్పులు చేశారు. దీని ప్రకారం గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏకగ్రీవం అయినా కాకపోయిన వీరిద్దరి పేర్లను అధిష్ఠానానికి ఆన్‌లైన్‌లోనే పంపాల్సి వస్తోంది. అసలు గ్రామ కమిటీ నిర్వహించే సత్తా వీరికి ఉందా అని అధిష్టానమే క్షేత్రస్థాయిలో ఆరా తీస్తుంది. గుణగణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారో లేదో నిర్ధారించుకుంటుంది.అధికారపక్ష ఎమ్మెల్యేలకు ఎంతో ఇష్టమైన పదం. తాము ఇచ్చిన వారికి పదవులు, ఇష్టం లేని వారికి రిక్తహస్తాలు. గ్రామ కమిటీల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు ఏదైనా ఇంతే. అంతటా ఇదే సూత్రం. అందుకనే కొందరు ఈ సూత్రానికి కట్టుబడి ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటారు. తద్వారా మెప్పు పొందుతారు. ఇంకోవైపు పదవులు పొందుతుంటారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియార్లదీ అదే పరిస్థితి. పైస్థాయిలో కూడా ఇదే పద్ధతి. అందుకనే పార్టీలో వంగి మోకరిల్లిన వారికే పదవులు దక్కుతాయని అందరు ఓ అంచనాకొచ్చేశారు. జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు దక్కించుకొన్నారు. మిగిలిన నియోజకవర్గాలలో ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. చాలాచోట్ల గ్రామ కమిటీ స్థాయిలోనే పెద్ద తేడా వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు వేగంగా కిందిస్థాయికి చేరటం లేదు. ఇంతకుముందు పార్టీని ప్రాణంగా భావించేవారు ఎవరైనా పార్టీని పల్లెత్తు మాటంటే విరుచుకుపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. అందరూ ‘ఎస్ బాస్’కు అలవాటు పడిపోయారు. ఫలితంగా రాబోయే నష్టాన్ని అధిష్ఠానం గుర్తించింది.  ఆ గ్రామాల్లో కార్యకర్తలు వీరిపట్ల చూపే మొగ్గునుబట్టి చివరకు కమిటీ ఓకె చేస్తారు. లేదంటే తదుపరి చర్యలకు దిగుతారు. ఇంతకుముందు మాదిరిగా గ్రామ, మండల స్థాయిలో ఎవరిపెత్తనం సాగుతుంటే వారివైపు ఉండేవ్యక్తి ఇలాంటి కమిటీలకు అధ్యక్షునిగా మారేవారు. కానీ దీనికి ఇప్పుడు పూర్తిగా చెక్ పెడుతున్నారు. మండల కమిటీలను ఇలాంటి విధానాన్ని పాటిస్తారా అంటే గ్రూపులు, వర్గాలు పెచ్చరిల్లినచోట ఏ వర్గానికి మొగ్గు చూపకుండా పార్టీ కోరుకున్న వారికే అసలు సిసలులో భాగంగా బాధ్యతలు అప్పగిస్తారన్న మాట. దీంతో కొందరి పెత్తనానికి నేరుగా తెరదించటమే కాకుండా వచ్చే ఎన్నికలనాటికి నేరుగా పార్టీ యంత్రాంగాన్ని ధీటుగా సమాయత్తం చేసేటట్టుగానే తెలుగుదేశం భావిస్తుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు తలలు పట్టుకున్నారు. గ్రామస్థాయిలో రకరకాల రాజకీయ కోణాలు ఉంటాయి. వ్యక్తిగతంగా మైనస్ ఉన్నా పార్టీపరంగా పైచేయి ఉన్నవారిని ఎంపిక చేయటం ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమేనా అనే ప్రశ్న సంధిస్తున్నారు.
Tags: Lokesh mark on institutional changes in TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *