తిరుమల కొండపై వాణిజ్య సముదాయంలో అగ్ని ప్రమాదం

Date:04/05/2021

తిరుమల ముచ్చట్లు:

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.తిరుమల కొండపై ఆస్థాన మండపం కింద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సర్క్యూట్తో దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం లో ఎనిమిది దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెను నష్టం తప్పిందని అధికారులు అంటున్నారు. కోవిడ్ కారణంగా భక్తుల రాక తక్కువగా ఉండటం,తెల్లవారు జామున కావడం, ఎవరూ లేకపోవడంతో  పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పది 0లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:A fire broke out in a commercial complex on Thirumala Hill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *