నిరాశతో ముగిసిన మామిడి సీజన్

Date:22/07/2019

తిరుపతి ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలో మామిడి రైతు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యింది. పంటను కోసి అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రాదనే ఆందోళన. కోయకుండా వదిలేద్దామంటే పెట్టుబడి దక్కదనే భయం. ఈ సందిగ్ధం ఈ ఏడాది మామిడి రైతును సీజన్‌ ఆద్యంతం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ 90 వేల టన్నుల పంట చెట్ల మీదే వుందని అంచనా. మామిడి కాయలను పల్ప్‌ ఫ్యాక్టరీలకు అమ్ముకోవాలని ప్రభుత్వం చెపుతోంది. తెలుగుదేశం నాయకులు తమ వారినే ముందుగా పిలిచి కొనుగోలు చేయాలని పల్ఫ్‌ ఫ్యాక్టరీల వారికి సిఫార్సు చేస్తోంది. సామాన్య రైతులను మాత్రం వారాల తరబడి వాహనాలను నిలబెట్టేయడంతో ఆరు బయటే మగ్గిపోయి కుళ్లిపోతున్నాయి.

 

 

 

 

ఈ దశలో ఆ పంట తమకొద్దంటూ ఫ్యాక్టరీ యాజమాన్యాలు తిప్పి పంపేస్తున్నాయి. జిల్లాలోని రైతులు మామిడి వైపు మొగ్గు చూపారు. పంట బాగా వస్తే గిట్టుబాటు ధర వస్తుందని ఆశపడ్డారు. జిల్లాలో 96వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. తోతాపురి అత్యధికంగా 53శాతం, బేనీషా 25శాతం, నీలమ, మల్లిక, సింధూరా, కాలేపాడు, రుమాని రకాలు 22 శాతం పంట వేశారు. గతేడాదికన్నా ఈ ఏడాది సీజన్‌ ఆలస్యంగా ప్రారంభమైనా దిగుబడి, నాణ్యత బాగానే వున్నా రైతుకు మాత్రం నిరాశే మిగులుతోంది. ఈ ఏడాది మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం కిలో తోతాపురికి మద్దతు ధర రూ.7.50 ప్రకటించింది.

 

 

 

 

 

గ్రామస్థాయి అధికారులు జారీ చేసే పర్మిట్లతో రైతులు గుజ్జు పరిశ్రమలకు మామిడిని తరలిస్తున్నారు. అయితే జిల్లాలో 56 గుజ్జు పరిశ్రమలు ప్రైవేట్‌వి ఉన్నా, వాటిలో కేవలం సగం మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ పరిశ్రమలు సైతం రోజుకు 6-7 టన్నుల మామిడిని మాత్రమే ప్రాసెసింగ్‌ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. దీంతో కాయలు కొనుగోలు చేయలేమని కొన్ని పల్ఫ్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలు బోర్డులు పెట్టేస్తున్నాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు తెలుగుదేశం పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వారి నుంచి కొనుగోలు చేస్తూ.. సామాన్య రైతులను రోడ్ల మీదే ఉంచేస్తున్నారు. దీంతో వాహనాల్లోనే పండ్లు కుళ్లిపోతున్నాయి. ఆ తరువాత ఆ పండ్లు తమకు పనికి రావని కొనుగోలు చేయబోమని తిప్పి పంపేస్తున్నారు.

 

 

 

బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల, పూతలపట్టు, పులిచెర్ల, సదుం, సోమల మండలాల్లో ఎక్కువగానూ, మిగిలిన మండలాల్లో తక్కువగానూ తోటల్లోనే కాయలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. దాదాపు 90 వేల టన్నుల పంట చెట్లలోనే మాగిపోతోంది. పూర్తిస్థాయిలో గుజ్జు పరిశ్రమలు ఈ మామిడిని కొనుగోలుచేస్తేనే మామిడి రైతుకు కొంతైనా ఊరట లభిస్తుంది.

 

 

 

 

పరిశ్రమల శాఖ మంత్రి జిల్లాలో ఉన్నా ఒక్క పల్ప్‌ ఫ్యాక్టరీ కూడా ప్రభుత్వం తరపున లేకపోవడం గమనార్హం. మామిడి పంటను వేసుకోవాలని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మార్కెటింగ్‌ చూపించకపోవడం రైతులకు శరాఘాతంగా మారింది. ప్రభుత్వ పరిశ్రమలు లేకపోవడంతో ప్రయివేట్‌ ఫ్యాక్టరీలు సిండికేట్‌గా ధరను శాసిస్తున్నాయి. కేజీ మామిడిపండ్లను రెండు రూపాయలకూ కొనే పరిస్థితి లేదు. కార్పొరేట్‌ కంపెనీలు ఈ రంగంలో ఉండడంతో దోపిడీకి హద్దూపద్దూ లేకుండా పోయింది.

వామ్మో…ఇదేం రోడ్డు

Tags: A mango season that ended in despair

తిరుమలలో శాస్త్రోక్తంగా పెద్దజీయంగార్‌ చాతుర్మాస దీక్ష సంకల్పం

Date:21/07/2019

తిరుమలముచ్చట్లు :

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం వైభవంగా జరిగింది.    ఈ సందర్భంగా పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుందని వివరించారు.

 

 

 

 

అనంతరం  చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ త‌ర్వాత సుముహూర్తంలో ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారన్నారు.   టిటిడి టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి ఎ.వి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

 

 

 

 

అంతకుముందు శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ  స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.   శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత తిరుమల ప్ర‌త్యేకాధికారి  ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాధ్ జెట్టి, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.  జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత  పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీచిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు.

 

 

 

 

అనంతరం పెద్దజీయర్‌ మఠంలో చిన్నజీయంగార్‌ కలిసి తిరుమల ప్ర‌త్యేకాధికారి, సివిఎస్వోని శాలువతో ఘనంగా సన్మానించారు. అనంత‌రం పెద్ద జీయంగార్ స్వామి భ‌క్తుల‌కు కొబ్బ‌రికాయాల‌ను బ‌హూక‌రించారు. ఈ కొబ్బ‌రికాయ‌ల‌ను ఇంటిలో ఉంచుకుంటే ఆయురారోగ్య‌లు, అష్ట‌ఐశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయ‌ని అర్చ‌కులు తెలిపారు.         ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో  హరీంద్రనాధ్‌, విజివో  మ‌నోహ‌ర్‌, ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పేష్కార్‌  లోక‌నాథం, బొక్కసం బాధ్యులు  గురురాజారావు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య

Tags: thirumalai-scientifically-bigotyayanar-chaturmasa-initiation-will

శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ

Date:21/07/2019

తిరుమల   ముచ్చట్లు :

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ప్రస్తుతం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపలి వరకు క్యూ ఉంది.అలాగే శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోంది.అలాగే టైంస్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతోంది.అలాగే స్వామివారి ప్రత్యేక దర్శనానికి కూడా 3గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

అక్టోబర్ నుండి నేరుగా మద్యం దుకాణాలు

Tags: The rush of devotees at Tirumala where Sri Venkateswaraswamy is known

ఆగస్టు 9న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

Date:21/07/2019

తిరుమల ముచ్చట్లు :

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పట్టపుదేవేరి అయిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగనుంది.

 

శ్రీ అలిమేలుమంగ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తపోదీక్షకు ప్రతిఫలంగా సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ తిరుచానూరులోని పద్మసరోవరంలో అవతరించింది. ప్రతి సంవత్సరం పవిత్రమైన శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.

 

 

 

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మీ పూజలతో సమానంగా భక్తులు విశ్వసిస్తారు. స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల్సిన విధానాన్ని తెలియజేశాడు. ఈ ప్ర‌కారం ఉదయాన్నే మంగళస్నానం చేసి ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీదేవిని దర్శించాలి. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు.

 

 

 

 

స్వ‌ర్ణ‌ర‌థంపై సిరుల‌త‌ల్లి క‌టాక్షం

వ్రతం రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

 

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

వరలక్ష్మీ వ్రతం కారణంగా ఆగ‌స్టు 9న‌ ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలతోపాటు ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను రద్దు చేయడమైనది. భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ

Tags: Varalakshmi Vratam at Sri Padmavathi Amman Temple on 9th August

తిరుమలలో ఆగస్టులో రెండు గరుడసేవలు జరగనున్నాయి.

Date:21/07/2019

తిరుమల  ముచ్చట్లు :

సాధారణంగా ప్రతి నెల పున్నమి రోజున ప్రత్యేక గరుడోత్సవం నిర్వహిస్తారు.అయితే ఆగస్టులో 15వ తేదీన వచ్చే పౌర్ణమితో పాటు 5వ తేదీన గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని గరుడోత్సవం నిర్వహించనున్నారు.

పోతురాజు కాలువ ఆధునికరణ

Tags: Two Garuda services will be held in Tirumala in August.

కమలం గూటికి నల్లారి

Date:20/07/2019

తిరుపతి ముచ్చట్లు:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా రాజకీయాలకు దూరమయ్యారు. పార్టీ పెట్టి దారుణ ఓటమి చవిచూసి అడ్రెస్ లేకుండా పోయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత అసలు బయట కనిపించడమే మానేశారు. ఏదో కొన్ని ఆవిష్కరణలు, శుభకార్యాల్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరినా పార్టీకి సంబంధం లేకుండా బతుకుతున్నారు. 2019 ఎన్నికల ముందు యాక్టివ్ అవుతారు అనుకున్నా … ఎక్కడా ఆయనకు అవకాశం కనిపించకపోవడంతో సరైన వేదిక దొరక్క ఆయన రాజకీయ అజ్జాత వాసం అనుభవిస్తున్నారు.తాజాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవేమీ గాసిప్స్ కాదు.

 

 

 

 

ఏపీలో కీలకంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆయనకు గాలం వేస్తోంది. ఈ
విషయాన్ని స్వయంగా బీజేపీ నేత చెప్పారు. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ఊహించని నేతలు పార్టీలోకి వస్తున్నారని, ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నార‌ని వెల్లడించారు. కిరణ్ నల్లారి బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్ర‌క‌టించారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో మరో మూడు నెలలు పదవీకాలం ఉండగానే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. తెలంగాణ ఏర్పాటును కిర‌ణ్ పూర్తిగా వ్య‌తిరేకించారు.

 

 

 

సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేశారు నల్లారి కిరణ్. అప్పటి పరిణామాల నేపథ్యంలో అతని మాటలపై జనానికి అంత విశ్వసనీయత కలగలేదు. దీంతో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, ఏపీలో తెలుగుదేశం అధికారాన్ని చేపట్టాయి. చివరకు కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరులో ఓడిపోయారు. ఇది ఆయన్ను బాగా హర్ట్ చేసింది. దీంతో ఆయనకు పూర్తిగా ఆసక్తి పోయింది. అయితే, ఇపుడు ఏపీలో బీజేపీకి సరైన సీఎం అభ్యర్థి లేకపోవడం, మోడీ సమర్థతపై అందరికీ గురి కుదరడం వల్ల ఏపీలో బీజేపీ ఎదగొచ్చని కొందరు నేతలు అంచనా వేస్తున్నారు.

 

 

 

 

ఇప్పటికే సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో సీఎం అభ్యర్థిగా కాబోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కిరణ్ లా అండ్ ఆర్డర్ లో చాలా పేరు తెచ్చుకున్నారు. ఎవరినీ లెక్కచేయలేదు. అందరూ భయపడే ఎంఐఎం ను జైల్లో కూర్చోబెట్టారు కిరణ్. మొత్తానికి ఆయన ఒకరకంగా ఈ యాంగిల్లో బీజేపీకి కనెక్టయ్యారేమో. అయితే, స్వయంగా ఆయన ప్రకటించేదాకా నమ్మలేం.

 

పక్కకు వెళ్లిపోయిన కొత్త జిల్లాల ఏర్పాటు

Tags: Kamalai gootti nallari

తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు

Date:17/07/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది, విఐపీ దర్శనాలకోసం అమలు చేస్తున్న ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 విధానాలకు బుధవారం నుంచి రద్దు చేసింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. విఐపి దర్శనాల రద్దు రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్డేట్ అనంతరం అమలులోకి తీసుకు వస్తాం. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన మర్యాదలు చేస్తామని అయన వివరించారు.

 

 

ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశం తో ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలనే కోరాను తప్ప,  ప్రత్యేకంగా ఛైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు కు కోరలేదని అయన అన్నారు.

 

 

టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ పై సుబ్బారెడ్డి మండిపడ్డారు. తండ్రీకొడుకుల్లాగా నేను,మా ముఖ్యమంత్రి దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. దేవుడు సొమ్ము ఒక్కరూపాయి కూడా నేను తాకను. అవసరమైతే నా చేతి నుంచి పదిమందికి సహాయం చేస్తానని అయన అన్నారు.

పిల్లలకు విషం తాగించి…తానూ తనువు చాలించి 

Tags: Cancel VIP visions at Tirumala

శ్రీవారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు దర్శనం

Date:17/07/2019

 

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం ఉదయం 11.00 గంటల నుండి సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. జూలై 17వ తేదీ చంద్రగ్రహణం కారణంగా జూలై 16న రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే.

 

బుధ‌వారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఉద‌యం 9.00 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఆణివార ఆస్థానం ఘ‌నంగా జ‌రిగింది. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

Tags: Visit to the devotees at the Srivari Temple from 11 am