తెలంగాణలో దౌర్భాగ్యపు పాలన : టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్

Troubled rule in Telangana: Chief Minister of TPCC
Date:26/02/52018
హైదరాబాద్  ముచ్చట్లు:
రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలన సాగుతోంది. కేసీఆర్ పాలనకు మా బస్సు యాత్ర ద్వారా చరమ గీతం పలుకుతామని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు అయన భారీ కాన్వాయ్ మధ్య బస్సుయాత్రకు బయలుదేరారు. అంతకుముందు నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ఉత్తమ్ మాట్లాడుతూ  కేసీఆర్ ఇచ్చిన హామీ ల ఏ ఒక్కటి నెరవేర్చలేదు. హామీల అమలుపై కేసీఆర్ పై వత్తిడి కోసమే కాంగ్రెస్ బస్సు యాత్ర అని వివరించారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు. అప్రజాస్వామిక పాలన పై బస్సు యాత్రతో ప్రజలను చైతన్యం చేస్తామని అయనఅన్నారు. తరువాత అయన ఆరే మైసమ్మ ఆలయంలో పూజలు జరిపారు. వేలాది వాహనాలు తో ఉత్తమ్ కు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
Tags: Troubled rule in Telangana: Chief Minister of TPCC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *