తొలి గ్రహణం జనవరి 10 ఏర్పడుతోంది

Date:06/01/2020

హైదరాబాదు ముచ్చట్లు:

ఈ ఏడాదిలో తొలి గ్రహణం జనవరి 10 ఏర్పడుతోంది. 2020లో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడుతుండగా ఇందులో నాలుగు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. జనవరి 10న ఏర్పడే చంద్రగ్రహణం దాదాపు నాలుగు గంటలపాటు ఉంటుంది. జనవరి రాత్రి 10.30 గంటల మొదలయ్యే గ్రహణం జనవరి 11 తెల్లవారుజామున 2.30 గంటలకు పూర్తవుతుంది. ఈ గ్రహణం భారత్‌తో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలతోపాటు ఆస్ట్రేలియాలోనూ కనువిందు చేయనుంది.జనవరి 10న శుక్రవారం రాత్రి 10 గంటలకు చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చంద్రుడి చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. తర్వాత 10.30 గంటలకు భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో గరిష్ఠ గ్రహణం కనిపిస్తుంది. తర్వా త మెల్లగా బయటికి రావడం ప్రారంభం అవుతుంది.

 

 

 

 

 

 

 

తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పరిసమాప్తవుతుంది. ఉదయం 3.30 గంటలకు భూమి ఉపచ్ఛాయ నుంచి చంద్రుడు బయటికి వస్తాడు.చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖ ఉండి.. చంద్రుడు, సూర్యుడికీ మధ్య భూమి వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది. అయితే, అన్ని పౌర్ణమిలలోనూ గ్రహణాలు ఏర్పడవు.ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం జూన్ 5న ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. పదిహేను రోజుల తర్వాత జూన్ 21 సూర్యగ్రహణం… జులై 5 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడతాయి. తిరిగి నవంబర్ 30న చంద్ర గ్రహణం, డిసెంబరు 14న సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి. జ్యోతిషు ల అభిప్రాయం ప్రకారం.. చంద్ర గ్రహణం సమయంలో రాహువు, శని చంద్రునితో కలిసి కర్కాటక రాశిలో ఉంటారు. ఇది గ్రహణం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది. సూర్య, చంద్రులతో పాటు శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు ఒకే వృత్తంలో ఉంటాయి.

 

లిబియాలో స్కూల్ పై దాడి: 30 మంది పిల్లల మృతి

 

Tags:The first eclipse occurs on January 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *