నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు 

Date:19/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 23వ తేదీన జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా చేసిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ద్వారా రూ.16.86 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. నిమజ్జనం ప్రధాన రోజైన సెప్టెంబర్23 వ తేదీన 117 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది.  వీటిని 35 లొకేషన్లలో ఏర్పాటు చేస్తున్నాం. 96 మొబైల్ క్రేన్ లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఇప్పటికే జిహెచ్ఎంసి ద్వారా నిర్మించిన 20 గణేష్ నిమజ్జన  కొలనులలో శుభ్రమైన నీటిని నింపడం జరిగింది.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారులలో రోడ్ల  రీ-కార్పెటింగ్, మరమ్మత్తులు, పూడ్చివేత తదితర పనులకు రూ. 10.52  కోట్లతో 169 పనులు మంజూరు చేయడం జరిగింది.  ఎస్ ఆర్ డి పి జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ఆదేశించడం జరిగింది.  నిమజ్జనం జరిగే అన్ని చెరువుల వద్ద భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను నియమించడం జరుగుతుంది. విద్యుత్ విభాగం ద్వారా 34,926 తాత్కాలిక లైట్లు రూ. 94. 21 లక్షల  వ్యయంతో ఏర్పాటు చేస్తున్నాం. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం బ్లీచింగ్ పౌడర్  చల్లడం జరుగుతుంది.
నిమజ్జనం జరిగిన వెంటనే చెరువుల నుండి విగ్రహాలను తొలగించడం జరుగుతుంది.రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల  మేర  బారికేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్ ప్రూఫ్  టెంట్లను వేయడం జరుగుతుంది.రోడ్లు, భవనాల శాఖ ఎలక్ట్రిక్ విభాగం ఆధ్వర్యంలో  75 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హెచ్ఎండిఏ  ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చెరువు నుండి నిమజ్జనం  ద్వారా  వచ్చే  వ్యర్ధాలను తొలగించడానికి వెయ్యి మందిని ప్రత్యేకంగా  నియమించ నున్నారు.
జలమండలి ద్వారా  మంచి నీటిని అందించడానికి  ప్రత్యేకంగా 101 వాటర్ క్యాంప్ ల ఏర్పాటు చేస్తున్నారు. 30 లక్షల వాటర్ ప్యాకెట్లను అందించనున్నాం. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గంలో 38    ఫైర్ ఇంజన్లు,  సరూర్నగర్, కాప్రా, ప్రగతి నగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3  బోట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్, సరూర్నగర్ వద్ద కేంద్ర విపత్తు  నివారణ దళాలను ఏర్పాటు,  పర్యాటక శాఖ ద్వారా హుసేన్ సాగర్ చెరువులో 7 బోట్ల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మరో 4 స్పీడ్ బోట్లు,    హుస్సేన్ సాగర్ లో  పదిమంది గజ ఈత గాళ్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు.
మోహర్రం ఏర్పాట్లు
డబీర్పురలోని సుప్రసిద్ద బీబీకా అలవా నుండి ఈ నెల 21న జరిగే మోహర్రం ఊరేగింపుకు జీహెచ్ఎంసీతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. బీబీకా ఆలం ఊరేగింపు మార్గంతో పాటు అన్ని అశుర్ ఖానాల మార్గంలో రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం తదితర 44 పనులను రూ. 2.89 కోట్లతో చేపట్టాం. శానిటేషన్ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది  అందుబాటులో వుంటారని అయన అన్నారు.
మోహర్రం ఊరేగింపు రోజు అదనంగా 95 మంది శానిటేషన్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. అశుర్ ఖానాల వద్ద ప్రతిరోజు ప్రత్యేక ఫాగింగ్,   ప్రధాన మార్గాల్లో రూ. 27లక్షల వ్యయంతో అదనపు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. బీబీకా ఆలం నుండి చాదర్ఘాట్ వరకు మోహర్రం ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో జలమండలి ద్వారా నాలుగున్నర లక్షల మంచినీటి ప్యాకెట్ల పంపిణీ చేస్తామన్నారు.
Tags:Large arrangements for immersion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *