పాత్రికేయులకు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Date:03/05/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా  భారతీయ పాత్రికేయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాచార యుగంలో వాస్తవమైన, సంచలనాలకు తావులేని వార్తను ప్రజలకు అందించడంలో పాత్రికేయులు పోషించాల్సిన పాత్ర మరింత కీలకమని అయన ట్వీట్టర్ ద్వారా పేర్కోన్నారు.  తప్పుడు సమాచారం నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిదే. కరోనా నేపథ్యంలోనూ ప్రజలకు సరైన సమాచారాన్ని అందజేసి, వారిలో ధైర్యాన్ని నింపిన పాత్రికేయుల పాత్ర అభినందనీయమని అయన అన్నారు.  పత్రికాస్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ, ప్రజల సమస్యలను మరీ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Happy World Press Freedom Day to Journalists – Vice President Venkaiah Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *